క్రైమ్/లీగల్

ఆగని అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: జీహెచ్‌ఎంసీలోని ఏ విభాగంలో చూసినా అవినీతే రాజ్యమేలుతోంది. మహానగరవాసులకు జీహెచ్‌ఎంసీ పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా సేవలందించేందుకు సర్కారు ప్రవేశపెడుతున్న ఆధునిక సంస్కరణలు ఏ మాత్రం ఫలించటం లేదు. ఎక్కడికక్కడ మధ్యవర్తులు, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎన్ని సరికొత్త విధానాలను ప్రవేశపెడుతున్నా, యథేచ్ఛగా అవినీతి రాజ్యమేలుతోంది. ఫలితంగా ఏటా పదుల సంఖ్యలో అవినీతి అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడుతున్నా, పరిస్థితుల్లో మార్పు రావటం లేదు. తాజాగా సికిందరాబాద్ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ వెంకటరమణ, మరో వ్యక్తి మధ్యవర్తిత్వంతో అవినీతికి పాల్పడుతూ చిక్కిన ఘటన శనివారం జీహెచ్‌ఎంసీలో సంచలనం సృష్టించింది. అధికారి ప్రమేయం అంతంతమాత్రమే ఉన్నా, బాధితుడు ధైర్యం చేసి అవినీతిని గుట్టురట్టు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారులు కొంతకాలం క్రితం ఎంతో పారదర్శకంగా చేపట్టామని చెప్పుకుంటున్న శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లు(ఎస్‌ఎఫ్‌ఏ) బదిలీల్లో కూడా భారీగా అక్రమాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే! ఇందులో ఏకంగా కొందరు ఎస్‌ఎఫ్‌ఏలు రికార్డుల్లో తమ జెండరను ‘మేల్’ నుంచి ఫీమేల్‌కు మార్చుకుని, ప్రస్తుతం పనిచేస్తున్న సర్కిల్‌కే బదిలీ అయిన ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా ఏసీబీకి చిక్కిన మెడికల్ ఆఫీసర్ నిబంధనలకు విరుద్దంగా ట్రేడ్ లైసెన్సు మంజూరు చేసేందుకు అవినీతికి పాల్పడినట్లు సమాచారం. ఇదే సర్కిల్‌లో ఇదివరకు విధులు నిర్వర్తించిన మెడికల్ ఆఫీసర్ కూడా తక్కువ కార్మికులతో పారిశుద్ధ్య పనుల చేయించి, మొత్తం కార్మికుల జీతాల డ్రాకు మంజూరీ ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. గడిచిన రెండేళ్లలో ఇదే సికిందరాబాద్ సర్కిల్‌లో కనీసం డజను మంది అధికారులు ఏసీబీకి చిక్కారు. అయినా ఈ సర్కిల్‌లో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది ఏ మాత్రం భయం లేకుండాపోయింది. ఏ పనికి వెళ్లినా, బహాటంగానే డబ్బులు డిమాండ్ చేయటం ఇక్కడి కొందరు సిబ్బంది, అధికారులకు మామూలైపోయిం ది. ఇదే రకంగా వివిధ సర్కిళ్లలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంటు మెడికల్ ఆఫీసర్లు బర్త్,డెత్ సర్ట్ఫికెట్లు మొదలుకుని, ట్రేడ్ లైసెన్సుల జారీ, స్వీపింగ్ కాంట్రాక్టర్లకు బిల్లుల మంజూరీ వంటి విషయాల్లో అనేక రకాలుగా అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఇదే రకంగా అవినీతికి పాల్పడి అడ్డదారిలో బర్త్ సర్ట్ఫికెట్లు జారీ చేసిన విషయం కూడా వెలుగుచూసింది. కొంతకాలం క్రితం వరకు తరుచుగా టౌన్‌ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారులు ఎక్కువగా ఏసీబీకి పట్టుబడేవారు. పారిశుద్ద్యం, ఆరోగ్యం విభాగాలకు చెంది న అధికారులు ఎక్కువ మంది ఏసీబీకి చిక్కుతున్నారంటే, ఏ స్థాయిలో చేతులు మారుతున్నాయో అంచనా వేసుకోవచ్చు.
డిప్యూటేషన్ ముగిసినా సీట్లు వదలరా?
జీహెచ్‌ఎంసీలో ఎన్ని ఆధునిక సంస్కరణలు ప్రవేశపెట్టినా, అవినీతికి ఎందుకు అడ్డకట్ట పడటం లేదనేది చర్చనీయాంశంగా మారింది. జీహెచ్‌ఎంసీలో డిప్యూటేషన్‌పై పోస్టింగ్ సంపాదించేందుకు అధికారులు లక్షల రూపాయలు ఖర్చు చేసి పైరవీలు చేస్తుంటారు. ఒక్క మూడు సంవత్సరాల పాటు ఇక్కడ పోస్టింగ్ దొరికితే చాలు దోచుకునేవారికి దోచుకున్నంత అన్న చందంగా తయారైంది. సదరు అధికారి కుటుంబం రెండు,మూడు తరాలకు కావల్సినంత సంపాదించుకుంటున్నారు. విధు ల్లో చేరిన కొత్తలో అద్దె ఇళ్లలో నివాసముంటున్న అధికారులు డిప్యూటేషన్ గడువు ముగిసేలోపు బహుళ అంతస్తుల సొంత భవనాలు, విలువైన కార్లు, శివార్లలో భూములను సంపాదించుకుంటున్నారంటే వీరు ఏ స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారో లెక్క కట్టవచ్చు. అందుకే డిప్యూటేషన్ గడువు ముగిసినా, సీట్లను వదలకుండా కొందరు అధికారులు డబ్బు, రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తూ, ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. కమిషనర్ వంటి ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటం కూడా ఓ కారణమని చెప్పవచ్చు. పైగా ఓ సర్కిల్ స్థాయిలో మెడికల్ ఆఫీసర్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ స్థాయిలో జరిగే అవినీతికి పైనున్న వివిధ హోదాలకు చెందిన అధికారులకు కూడా వాటాలుండటం వల్లే ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవినీతికి అడ్డకట్ట పడటం లేదన్న వాదన ఉంది.