క్రైమ్/లీగల్

దోపిడీ దొంగల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 21: జాతీయ రహదారిపై ప్రయాణించే వారిని బెదిరించి దొంగతనానికి పాల్పడుతున్న 9 మంది ముఠా సభ్యులను నెల్లూరు సిసిఎస్, నెల్లూరు రూరల్ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు సిసిఎస్ డిఎస్పీ బాలసుందరరావు శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. పులి రవి (సంతపేట), షేక్ అబ్దుల్ అజీజ్ (పాత చెక్‌పోస్ట్), షణ్ముగ విశాల్ (ఉడ్‌హౌస్ సంఘం), ఈగ దిలీప్‌కుమార్ (నాగేంద్రనగర్), అరవ వెంకటసాయి (ఉడ్‌హౌస్ సంఘం), ఆర్.శ్రీనివాసులు (శెట్టిగుంట రోడ్), గోగులపాటి క్రాంతికుమార్ (శెట్టిగుంట రోడ్), షేక్ సల్మాన్ (జనార్ధన్‌రెడ్డి కాలనీ), పాలడగు ధ్రువతేజ ( ఇస్కాన్‌సిటీ)లు చెడు వ్యసనాలకు బానిసలై మద్యం, గంజాయి తదితర మత్తుపదార్థాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో రాత్రి సమయాల్లో జాతీయ రహదారిపై కాపుకాచి వాహనదారులను కొట్టి, భయపెట్టి వారి వద్ద నుండి నగదు, వాహనాలను దోచుకెళ్లడం వృత్తిగా చేసుకున్నారు. గతంలో బాలాజీనగర్, నెల్లూరు రూరల్, కొడవలూరు పోలీస్‌స్టేషన్ల పరిధిలో జాతీయ రహదారిపై వీరు పలు దోపిడీలకు పాల్పడినట్లు కేసులు నమోదై ఉన్నాయి. వీరిపై నిఘా ఉంచిన నెల్లూరు క్రైం బ్రాంచ్ డిఎస్పీ నేతృత్వంలో రూరల్ సిఐ శ్రీనివాసులరెడ్డి, క్రైం బ్రాంచ్ ఎస్సై మధుసూధన్‌రావు, హెడ్ కానిస్టేబుళ్లు హరేంద్రబాబు, వి.కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు పి.సతీష్, సుధాకర్, ఆర్‌వి రత్నయ్య, శ్రీనయ్య, టి.శ్రీనివాసులు, శ్రీ్ధర్‌లు ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి ఎంతోకాలంగా తప్పించుకు తిరుగుతున్న పై ముఠా సభ్యులను స్థానిక పెన్నానది సమీపాన ఉన్న తిక్కన పార్కు వద్ద శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక ఆటో, ఒక బుల్లెట్, రెండు మోటార్‌సైకిళ్లు, రూ.15వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందికి రివార్డుల నిమిత్తం సిఫార్సు చేస్తున్నట్లు డిఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సిఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్సై మధుసూదన్‌రావు తదితరులు పాల్గొన్నారు.