క్రైమ్/లీగల్

లాకర్ల దొంగలను పట్టుకున్న ఈస్ట్ ఎస్‌ఐ దయాకర్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 21: తిరుమల పీఏసీ-2లో నెల్లూరుకి చెందిన భక్తుడు రూ.30వేలు విలువచేసే సెల్ ఫోన్లు, నగదు చోరీకి గురైన సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే తిరుపతి విష్ణు నివాసంలో లాకర్లు తెరవడానికి ప్రయత్నించి పోలీసులకు పట్టుబడ్డారు. ఈస్ట్ ఎస్‌ఐ దయాకర్ రెడ్డి కథనం మేరకు వివారాలు ఇలా ఉన్నాయి. వైజాగ్‌కు చెందిన కొందరు భక్తులు స్థానిక విష్ణునివాసంలో లాకర్‌ను తీసుకుని అందులో తమ వస్తువులను భద్రపరచుకుని తిరుమలకు బయలుదేరి వెళ్లారు. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బళ్లారికి చెందిన రాధాకృష్ణ, కృష్ణమూర్తి అనే ఇద్దరు వ్యక్తులు తమ వద్ద ఉన్న మారు తాళాలలతో భక్తులకు సంబంధించిన వస్తువులను దొంగిలించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ దయాకర్ రెడ్డి వారిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. నిందితులు అంతక మునుపు విష్ణు నివాసంలో భక్తుల తరహాలో లాకర్‌ను తీసుకుని టీటీడీ సిబ్బంది నుంచి తాళాలు పొందారు. అటు తరువాత అదే తాళాలకు మారు తాళాలు తయారు చేయించుకుని అసలు తాళాలను టీటీడీ సిబ్బందికి ఇచ్చి వెళ్లిపోయారు. అటు తరువాత అక్కడే కాపుకాసి ఆ లాకర్‌లో భక్తులు తమ వస్తువులు ఉంచి వెళ్లగానే మారు తాళాలతో తెరిచే ప్రయత్నం చేసి పట్టుబడ్డారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ దయాకర్ మాట్లాడుతూ లాకర్ దొంగతనాలకు పాల్పడేందుకు ముందుగా నిర్ణయించుకున్న నిందితులు పథకం ప్రకారం మారు తాళాలు తయారు చేయించుకుని చోరీలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈక్రమంలో టీటీడీ యాజమాన్యం భక్తులకు ఇచ్చే లాకర్ల తాళాలను ఒక లాకర్‌కు ఒకే తాళం కొనసాగించే విధానం కాకుండా వాటిని మరో లాకర్‌కు వినియోగించే విధానం అనుసరిస్తే ఇలాంటి చోరీలను నివారించడం సాధ్యమవుతుందని, ఇదే విషయాన్ని తమపై అధికారుల ద్వారా టీటీడీ అధికారులకు సూచించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఏదేమైనా లాకర్ దొంగలను పట్టుకోవడంలో ఈస్ట్ పోలీసులు చూపిన చొరవ పలువురి ప్రశంసలు అందుకుంది.