క్రైమ్/లీగల్

ఆర్థిక బాధలతో ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జూలై 20 : నమ్మి 20 లక్షల రూపాయల మేర నష్టపోవడమేకాక ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మార్కాపురం పట్టణానికి సమీపంలో ఇటీవల పురుగుల మందుతాగి గుంటూరుజిల్లా నాదెళ్ళ మండలం నూజెండ్లవారిపాలెంకు చెందిన జి లీలానాగప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాఠకులకు విదితమే. ప్రసాద్ పిఎంఆర్‌వై పథకంలో కర్నూలు, కడప జిల్లాలకు చెందిన ఇన్‌ౄళర్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే కడపకు చెందిన ఓ మహిళతో పరిచయమై పిఎంఆర్‌వై కింద ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యేందుకు సుమారు 20లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడు. పని పూరె్తైన తరువాత ఆ మహిళ ఈ కంప్యూటర్ శిక్షణ కేంద్రంతో నీకేమిటి పని, నువ్వు ఎవరు అంటూ ఎదురుతిరగడంతో మనస్థాపం చెందాడు. కాగా పెట్టుబడి పెట్టిన విషయాన్ని గమనించిన ప్రసాద్ బంధువులు కడపజిల్లాకు వెళ్ళి ఆ మహిళ బంధువులను అడిగి 12లక్షల రూపాయలకు కాగితాలు వ్రాయించుకోవడం జరిగింది. ఇదే సమయంలో ప్రసాద్, బంధువులు తమ ఇంటిపై దాడిచేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ ప్రసాద్ కుటుంబసభ్యులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. దీనితో డబ్బులుపోయి పరువుపోయిందని మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రసాద్ తల్లిదండ్రులు తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని, మహిళతోపాటు తండ్రి, మేనమామ కలిసి తమవాడిని ఏదోచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై జి కోటయ్య తెలిపారు.