క్రైమ్/లీగల్

న్యాయం చేయాలని వెళితే.. ఎస్‌ఐ తిట్టాడని బలవర్మణానికి యత్నించిన మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జూలై 20: పుట్టపర్తిలోని ఓ కళాశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేయడమే కాకుండా తనబిడ్డ చదువుకున్న సర్ట్ఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని, న్యాయం చేయమని ఎస్‌ఐని అడిగితే తన పట్ల అసభ్య పదజాలంతో తిట్టాడని ఆరోపిస్తూ ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సంఘటన శుక్రవారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. ప్రస్తుతం ఆమె మదనపల్లె ప్రభుత్వవైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై ఎస్‌ఐ మల్లికార్జుననాయుడును వివరణ కోరగా తాను ఆ మహిళ పట్ల ఏలాంటి అసభ్య పదజాలం ఉపయోగించలేదని, పూర్తిస్థాయిలో వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నించినట్లు తెలిపారు. మదనపల్లెలో బాధితురాలు చికిత్స పొందుతున్న సమయంలో స్థానికంగా ఉన్న విలేఖరులను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకున్నట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. మరికొంతమంది విలేఖరులు ఆమెను కలసినప్పుడు ఎస్‌ఐపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇందుకు సంబంధించిన కొంతమంది విలేఖరులు ఆమె సంబాషణను చిత్రీకరించి సోషల్‌మీడియాలో పెట్టడంతో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు లక్షిదేవి కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి... బి.కొత్తకోటకు చెందిన లక్ష్మీదేవి(42) కుమార్తె ధనలక్ష్మీ పుట్టపర్తిలోని ఓ విదేశీసంస్థ ఏర్పాటుచేసిన ఇంజనీరింగ్ కళాశాలలో చదువుముగించింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు బెంగళూరులో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆ కళాశాల నిర్వాహకులు చెప్పడంతో, కళాశాలలో చదువుతున్న 60మంది యువతీ, యువకులు తన సర్ట్ఫికెట్‌లు తీసుకుని పుట్టపర్తికెళ్లారు. సర్ట్ఫికెట్లు తీసుకున్న నిర్వాహకులు వారిని బెంగళూరుకు తరలించారు. ఆ తర్వాత జరిగిన తెలియదు కానీ, 60 మంది యువతీ, యువకులను పుట్టపర్తికి తీసుకువచ్చారు. ఈ వ్యవహారం గత మూడుమాసాల క్రితం జరిగింది. కళాశాల నిర్వాహకులు పిల్లల వద్ద తీసుకున్న సర్ట్ఫికెట్లు ఇవ్వకపోవడంతో తల్లి లక్ష్మీదేవి పుట్టపర్తి, బెంగళూరు పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేసింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో పలువురి సూచనల మేరకు బి.కొత్తకోట మండలంలో పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ, లక్ష్మీదేవి ఎలుకలమందు ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఆమెను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మీడియా పాత్రికేయులు ఆసుపత్రికి వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. బాధితురాలు ఎస్‌ఐ మల్లికార్జుననాయుడుపై ఆరోపణలు చేస్తున్నప్పటికీ, ఎస్‌ఐ అవేమి లేవంటూ కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ పోలీస్‌శాఖను ప్రజలలో దరిచేర్చడానికి విశ్వప్రయత్నం చేస్తుంటే, ఇలాంటి సంఘటనలు పోలీస్‌శాఖపై ప్రజలలో మరింత అపోహ సృష్టించే ప్రమాదం ఉంది. బాధితురాలి చెప్పే విషయంలో వాస్తవాలు ఉంటే, ఆమె కుమార్తెతోపాటు మరో 59మంది విద్యార్థులకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీస్‌శాఖపై ఉంది.