క్రైమ్/లీగల్

టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 20: టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుండి దాదాపు 9లక్షలు వసూళ్లకు పాల్పడి మోసగించిన ముగ్గురు నిందితులను తిరుమల టూటౌన్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. బుధవారం రాత్రి నిందితులను తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ వద్ద గల ఓ బార్ ముందు అదుపులోనికి తీసుకున్నామన్నారు. తిరుమల లా అండ్ ఆర్డర్ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, సీఐ రామకృష్ణ, టూటౌన్ ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ల ఆధ్వర్యంలో నిందితులను విచారించి 17లక్షల విలువ చేసే ఎక్స్‌యువి 500 కారు, ల్యాప్‌టాప్‌లు, యమహా ఆర్15 బైక్, ఒక ఎల్‌ఈడీ టీవీ, 16లక్షల రూపాయల నగదు, రెండు నివాస గృహాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఏ1 బాలకృష్ణ, ఏ2 అనిల్‌కుమార్, ఏ3 లోకేష్‌రెడ్డి నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను తిరుపతి కోర్టులో హాజరుపరిచామని తెలిపారు.
అనుమానాలకు తావిస్తున్న పోలీసుల తీరు
టీటీడీ వంటి ధార్మిక సంస్థలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇంత పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడితే తిరుమల పోలీసులు మాత్రం రాజకీయ నాయకులకు తలొగ్గి కేసు నీరుగార్చే విధంగా కనీసం మీడియాకు నిందితులను చూపకుండా ప్రెస్‌నోట్ ఇవ్వడంపై పలు విమర్శలకు తావిస్తోంది. కనీసం ముద్దాయిలు ఎక్కడి వారో, వారి వివరాలను సైతం పోలీసులు తెలపలేదంటే పరిస్థితిని గమనించవచ్చు.