క్రైమ్/లీగల్

భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, జూలై 20: ఆటోలో భారీగా గుట్కాలు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు లక్షా 70వేల రూపాయలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, ఒక ఆటోను శుక్రవారం ఎస్‌వోటీ పోలీసులు స్వాధీనం చేసుకొని భువనగిరి పోలీసులకు అప్పగించినట్లుగా ఎస్‌వోటీ సీఐ గంగాధర్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ఎస్‌వోటీ పోలీసులు అనుమానస్పదంగా కనిపించిన ఆటోలో తనిఖీ చేయడంతో గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయని, గుట్కా ప్యాకెట్లు రవాణా చేస్తున్న వ్యక్తులు హైద్రాబాద్‌కు చెందిన వారుగా తెలిపారు. గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న వారిలో ఎస్‌వోటీ పోలీస్ సిబ్బంది క్రిష్ణ, ఇబ్రహీమ్ తదితరులు పాల్గొన్నారు.