క్రైమ్/లీగల్

అదుపుతప్పి స్కూలు బస్సు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాజులూరు, జూలై 16: ఒక స్కూలు బస్సు అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తా పడటంతో తృటిలో ఘోర ప్రమాదం తప్పి స్వల్ప గాయాలతో బస్సులో విద్యార్థులు బయటపడ్డారు. స్థానికులు, గొల్లపాలెం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాజులూరు మండలం గొల్లపాలెంలో గల టిఎస్‌ఎన్ మూర్తి కళాశాలకు చెందిన స్కూలు బస్సు సాయంత్రం స్కూలు ముగియడంతో గొల్లపాలెం నుండి మండలానికి చెందిన చేదువాడ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గొల్లపాలెం-కుయ్యేరు ప్రధాన రహదారిలో వేంకటేశ్వరస్వామి ఆలయం దాటిన తరువాత మలుపు రావడంతో సోమవారం కురిసిన వర్షానికి అద్దంపై ఉన్న వైపర్ పనిచేయకపోవడంతో గ్లాస్ మొత్తం మసకబారింది. దీంతో టర్నింగ్ తిరగగానే కొద్దిపాటి దూరంలో మరో టర్నింగ్ ఉండటంతో బస్సు ఎదురుగా ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లిపోతుందన్న భయంతో డ్రైవర్ బ్రేకు వేశాడు. బస్సు అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. దీంతో డ్రైవర్ వెంటనే బస్సులో ఉన్న సుమారు 25 మంది విద్యార్థులను బయటకు తీసుకువచ్చాడు. ఈ సంఘటనలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా వారికి ప్రథమ చికిత్స అందించి ఆటోల్లో తరలించారు. ఇదిలావుండగా విషయం తెలుసుకున్న స్కూలు యాజమాన్యంతో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని తమ పిల్లలను ఇళ్ళకు తీసుకెళ్ళారు. ఈ బస్సులో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు 19, 1 నుండి 5వ తరగతి చదువుతున్న మరో ఆరుగురు ఉన్నారు. ఈ సంఘటనపై గొల్లపాలెం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.