క్రైమ్/లీగల్

జార్ఖండ్‌లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హజారీబాగ్ (జార్ఖండ్), జూలై 15: సమస్యలను ధైర్యంగా ఎదుర్కోలేక కొందరు, మతాచారాల పేరుతో మరికొందరు, సమాజం ఏమనుకుంటుందోనన్న భయంతో ఇంకొందరు.. కారణాలు ఏవైనా, ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూడడం, తీవ్రమైన ఒత్తిడికి లోనుకావడం, చివరికి ఆత్మహత్య చేసుకోవడం ఇటీవల కాలంలో పెరుగుతున్న పెడధోరణులకు అద్దం పడుతుంది. ఇటీవలే దేశ రాజధానిలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇంకా మరవక ముందే జార్ఖండ్‌లో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలోని ఆరుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను విషాదంలో ముంచెత్తింది. హజారీబాగ్ జిల్లా బోడోమ్ బజార్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఉత్తర ఛోటానాగపూర్ రేంజ్ డీఐజీ పంకజ్ కంబోజ్ తెలిపిన వివరాల ప్రకారం రెండు పక్కపక్కనే ఉన్న ఫ్లాట్స్‌లో ముగ్గురు ఉరేసుకున్నారు. వాటిలో ఒక ఫ్లాట్‌లో బాలిక, బాలుడు నేలపై రక్తం మడుగుల్లో పడి ఉన్నారు. మరో వ్యక్తి ఈ అపార్ట్‌మెంట్ గేటు వద్ద
విగతజీవుడై కనిపించాడు. ఈ వ్యక్తి నాలుగో అంతస్థు నుంచి దూకినట్టుగా అనుమానిస్తున్నారు. మృతులను మహావీర్ ప్రసాద్ మహేశ్వరి (70), ఆయన భార్య కిరణ్ మహేశ్వరి (65), వారి కుమారుడు నరేష్ ప్రసాద్ మహేశ్వరి (40), కోడలు ప్రీతీ మహేశ్వరి (38), మనవరాలు, మనవడుగా గుర్తించారు. కాగా, ఫ్లాట్స్ నుంచి ఆరు సూసైడ్ నోట్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, అయితే, వాటిని ఒకే వ్యక్తి రాసినట్టు కనిపిస్తున్నదని పంకజ్ కంబోజ్ తెలిపారు. పిల్లలకు మత్తుమందు ఇచ్చి, ఆతర్వాత వారి గొంతులను కోసేసినట్టు ప్రాథమిక విచారణలో తెలుస్తున్నదని అన్నారు. ఆతర్వాత ముగ్గురు ఉరేసుకోగా, ఒకరు అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్థు నుంచి దూకి మృతి చెందినట్టు అనుమానిస్తున్నామని తెలిపారు. చుట్టుపక్కల వారిని విచారించినప్పుడు, ఆ ఇంటి నుంచి అరుపులు, కేకలు లేదా ఏడుపులు ఏవీ వినిపించలేదని చెప్పారని పంకజ్ కంబోజ్ పేర్కొన్నారు. కాగా, అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతుందని సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ మయూర్ పటేల్ కన్హయ లాల్ ప్రకటించారు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాతే వారు ఎలా మృతి చెందారన్న ప్రశ్నకు సమాధానం వస్తుందన్నారు. మొత్తం మీద ఢిల్లీ ఉదంతం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించగా, అదే తరహాలో జార్ఖండ్‌లో మరో దారుణం చోటు చేసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నది.