క్రైమ్/లీగల్

రూ.50లక్షలకు మించితేనే అప్పీల్‌కు అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రతి చిన్న విషయానికీ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ప్రభుత్వాలకు ఇకపై ఉండదు. కనీసం 50 లక్షల రూపాయలకు మించిన అంశాలపై మాత్రమే అప్పీల్ చేసుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. లెక్కకు మించి పేరుకుపోతున్న కేసులతో సతమతమవుతున్న సుప్రీం కోర్టు కేసులను తగ్గించుకోవాలన్న ఆలోచనలో ఉంది. ఆ క్రమంలోనే ప్రభుత్వ కేసులపై నియంత్రణ విధించింది. వివిధ కేసుల్లో 10 లక్షల రూపాయలు లేదా అంతకంటే తక్కువ మొత్తాలను ఇవ్వాలని ఆయా హైకోర్టులు జారీ చేసిన ఉత్తర్వులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో సవాలు చేస్తున్నాయి. హైకోర్టులు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతున్నాయి. దీనితో వ్యక్తులు, ప్రభుత్వాల మధ్య వేలాదిగా ఉన్న కేసులు సుప్రీం కోర్టు చేరుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీం కోర్టు అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు. ఇక ముందు హైకోర్టు ఆదేశాల ప్రకారం ఒక వ్యక్తికి 50 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలను చెల్లించాల్సి వచ్చినప్పుడు మాత్రమే సదరు ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. లేకపోతే, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనని తెలిపారు. సుప్రీం కోర్టు సమయం వృథా కాకుండా ఉండడమేగాక, బాధితుడికి సత్వర న్యాయం జరగడానికి కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు.