క్రైమ్/లీగల్

మసాజ్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 1: మసాజ్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఒక నిర్వాహకురాలిని, ఆమెకు సహకరిస్తూ ఆ సంస్థలో పని చేస్తున్న మరో ముగ్గురిని టాస్క్ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. మసాజ్ పేరుతో అక్రమంగా క్రాస్ మసాజ్ చేస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ దాడి చేసింది. అబిడ్స్‌లోని చిరాగ్ అలీ లైన్‌లో ఎస్‌ఎస్ నేచురల్ ఫ్యామిలీ స్పా, సెలూన్ నిర్వహిస్తున్నారు. నిర్వాహకురాలు రాధమ్మ, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నిర్వాహకురాలు గతంలో నారాయణగూడలో కూడా స్పాను నిర్వహించింది. ఇందుకు సంబంధించి రెండు కేసులు కూడా గతంలో నమోదయ్యాయి. ఆ తర్వాత ఏ వ్యాపారం ఆమెకు కలిసిరాకపోతే తిరిగి మళ్లీ చిరాగ్ అలీ లైన్‌లో అద్దె భవనంలో స్పా నిర్వహిస్తూ ఇద్దరు యువతులతో అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఒక్కో కస్టమర్ నుంచి రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ దాడి చేసి నిర్వాహకురాలితో పాటు మిగిలిన ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. నిందితులు నలుగురిని అబిడ్స్ పోలీసులకు తదుపరి దర్యాప్తు కోసం అప్పగించారు. సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాస రావు నేతృత్వంలోని బృందం పట్టుకుంది.