క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్కరాయసముద్రం, జూలై 1 : మండలంలోని చెన్నంపల్లి గ్రామానికి చెందిన దీపికాలక్ష్మి (20) ఆదివారం ఇంట్లో పైకప్పునకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుక్కరాయసముద్రం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు చెన్నంపల్లికి చెందిన అశోక్‌కు పెద్దపడమలకు చెందిన లక్ష్మీ, గంగాధర్ కుమార్తె దీపికాలక్ష్మితో మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈనేపథ్యంలో దీపికాలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడంపై తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశులు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త అశోక్, అన్న రాజశేఖర్‌ను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.