క్రైమ్/లీగల్

పోలీసుల అదుపులో మావోయిస్టు కొరియర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూన్ 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని చర్ల మండలంలో మావోయిస్టులకు కొరియర్లుగా పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. భద్రాచలం ఏఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మంగళవారం తెలిపిన వివరాల మేరకు.. చర్ల పోలీసులు, 141 బెటాలియన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు ఈనెల 25వ తేదీన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్ల-పూసుగుప్ప రహదారిలో వాహన తనిఖీలు చేపట్టారు., ఈ సమయంలో అనుమానాస్పదంగా ఒక మహిళ సహా మరో ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో వారిని విచారించగా నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన నాయకులకు వీరు కొంతకాలంగా కొరియర్లుగా వ్యవహరిస్తున్నట్లు వెల్లడైంది. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో అనుముల లక్ష్మిది చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఆవుపల్లి మండలం కాగా, బండారి ప్రవీణ్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతె గ్రామం అని, మరో కొరియర్ రంపా క్రాంతి కుమార్ వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల అశోక్‌నగర్‌కు చెందిన వాడని ఏఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 200 మీటర్ల ఆలివ్ గ్రీన్ వస్త్రం, 15 డిటోనేటర్లు, 10 జిలిటెన్‌స్టిక్స్, రూ.20వేల నగదు, ఐదు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిని రిమాండ్‌కు పంపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విలేఖర్ల సమావేశంలో చర్ల ఎస్సై రాజువర్మ, సీఆర్‌పీఎఫ్ 141 బెటాలియన్ కమాండెంట్ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.