క్రైమ్/లీగల్

యాత్రికుల బస్సుకు విద్యుదాఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని, జూన్ 25: తూర్పు గోదావరి జిల్లా తుని మండలం వెలమకొత్తూరు గ్రామంలో సోమవారం ఉదయం యాత్రికులతో వెళుతున్న బస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో బస్సు క్లీనర్ దుర్మరణం చెందాడు. డ్రైవర్ సహా ముగ్గురు గాయపడ్డారు. వివరాలిలావున్నాయి... ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన భక్తులు కాశీ యాత్ర నిమిత్తం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వెళ్ళారు. యాత్ర ముగించుకొని చివరిగా తుని మండలం లోవలోని తలుపులమ్మతల్లి దర్శనం నిమిత్తం వెళుతున్నారు. అయితే వెలకొత్తూరు గ్రామం వద్ద విద్యుత్ వైర్లు బస్సుకు తగిలాయి. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బస్సు క్లీనర్ మార్గాని కుమారస్వామి (20) బస్సు నుండి కిందకు దిగే ప్రయత్నం చేయగా, విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సు డ్రైవర్ మహ్మద్ ఇబ్రహీం, యాత్రికులు తాండ్ర అప్పారావు, దానం లక్ష్మికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. తుని రూరల్ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.