క్రైమ్/లీగల్

హంతక మేజర్‌కు 4 రోజుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: సహోద్యోగి భార్యను కిరాతంగా హత్యచేసిన ఆర్మీ మేజర్ నిఖిల్ హండాకు కోర్టు నాలుగు రోజుల రిమాండ్ విధించింది. యూపీలోని మీరట్ పట్టణంలో నిఖిల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రత మధ్య ఆర్మీ మేజర్‌ను కోర్టుకు తీసుకొచ్చారు. నిందితుడుని నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపుతూ మెజిస్ట్రేట్ మనీషా త్రిపాఠీ ఆదేశించారు. మరో ఆర్మీ మేజర్ భార్యనే నిఖిల్ హండా హత్య చేశాడు.‘హత్యకు ఉపయోగించిన కత్తి, అప్పడు ధరించిన దుస్తులు, పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నాం’అని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో లోతుకంటూ దర్యాప్తు జరపడానికి వీలుగా నిఖిల్ హండాను కస్టడీకి నాలుగు రోజులు కస్టడీకి పంపుతున్నట్టు మెజిస్ట్రేట్ తెలిపారు. పశ్చిమ ఢిల్లీలో ఆర్మీ మేజర్ భార్యను హండా హత్య చేశాడు. గొంతుకోసి ఆమెను హతమార్చినట్టు ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైంది. శనివారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ కంటోనె్మంట్ ప్రాంతంలోని బ్రార్ స్క్వేర్ వద్ద ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు.

చిత్రం..తన సహ ఉద్యోగి భార్యను హత్య చేశాడన్న ఆరోపణను ఎదుర్కొంటున్న ఆర్మీ మేజర్ నిఖిల్ రాయ్ హాండాను పటియాలా కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళుతున్న ఢిల్లీ పోలీసులు