క్రైమ్/లీగల్
అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 June 2018
పరవాడ, జూన్ 21: అదృశ్యమైన మైనర్ బాలిక స్వీటీ కుమారి ఆచూకీ లభ్యం అయినట్లు పరవాడ పోలీస్స్టేషన్ రైటర్ కెనడీ తెలిపారు. మండలంలో దేశపాత్రునిపాలెంలో నివాసం ఉంటున్న సిఐఎస్ఎఫ్ ఉద్యోగి సత్యేంద్ర కుమార్ సింగ్ కుమార్తె స్వీటీ సింగ్ ఈనెల 19వ తేదీన ఇల్లు విడిచి వెళ్లినట్లు బుధవారం పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్వీటీ సింగ్ ఉక్కునగరం కేంద్రీయ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్నారు. ఇల్లు విడిచి వెళ్లి స్వీటీ సింగ్ పాట్నాలో గల బంధువులు ఇంటి వద్ద ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్వీటీసింగ్ను తీసుకు వెళ్లేందుకు తల్లిదండ్రులతో పాటు పరవాడ పోలీసులు గురువారం పాట్నా బయలదేరి వెళ్లారు.