క్రైమ్/లీగల్

కుమార్తెపై కన్న తల్లి కర్కశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 19: ఉన్మాదంతో కన్న తల్లి తన ఆరేళ్ల కుమార్తెపై కర్కశంగా కత్తితో దాడి చేసి, హత్యాయత్నం చేసింది. పోలీసు కేసు నుంచి తప్పించుకునేందుకు కట్టుకథ అల్లింది. అయితే చిన్నారి బాలిక పోలీసులకు జరిగిన విషయం తెలియజేయడంతో కన్నతల్లి కర్కశం బయటపడింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం దివాన్‌చెరువులో నివసించే సుబ్బా శారద స్థానిక దాబాలో పనిచేస్తుంది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. తొలి భర్తతో విడిపోయి, మరొకరిని వివాహం చేసుకున్న ఆమె అతనితో కూడా దూరంగా ఉంటుంది. తన ఇద్దరు పిల్లలతో విడిగా నివసిస్తోంది. సోమవారం రాత్రి తన పెద్ద కుమార్తె లక్ష్మి(6) నోట్లో గుడ్డలు కుక్కి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈదాడిలో లక్ష్మి స్పృహ కోల్పోయింది. దీంతో కుమార్తె మరణించిందని భావించి, సమీపంలోని తోటలో పారవేసింది. అయితే తనపై పోలీసులు కేసు నమోదు చేస్తారన్న భయంతో ఉదయం కట్టుకథ అల్లింది. అమ్మమ్మ ఇంటికి వెళ్లి నిద్రిస్తానని చెప్పి వెళ్లిన తన కుమార్తెపై గుర్తుతెలియని ముసుగువ్యక్తి ఎత్తుకెళ్లి బ్లేడుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని, తోటలో పారేసి వెళ్లిపోయాడని స్థానికులు, పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించింది. రాత్రంతా వెతికినా తన కుమార్తె జాడ తెలియలేదని చెప్పింది. తెల్లవారుజామున 3గంటలకు తన కుమార్తె గాయాలతో ఇంటికి రావడంతో ఈవిషయం తెలిసిందని పోలీసులు, స్థానికులను నమ్మించే ప్రయత్నం చేసింది. అర్బన్ ఎస్పీ బి రాజకుమారి స్వయంగా రంగంలోకి దిగి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి లక్ష్మిని విచారించడంతో శారద కర్కశత్వం బయటపడింది. దీంతో శారదను బొమ్మూరు పోలీసులు అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.