క్రైమ్/లీగల్

బియ్యం సంచులు మీద పడి హమాలీ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, జూన్ 18:పట్టణంలోని సివిల్ సప్లయ్ గోదాములో సోమవారం సాయంకాలం బియ్యం సంచులు నెట్టు వేస్తున్న హమాలీ సుధాకర్‌పై సంచులు పడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వివరాలు.. కర్నూలు నుంచి లారీల్లో బనగానపల్లె స్టాక్ పాయింట్‌కు వచ్చిన బియ్యం సంచులను హమాలీలు గోదాములో నెట్టు వేస్తున్నారు. ఈ క్రమంలో సుధాకర్ బియ్యం సంచిని వేసి వెళ్తున్న సమయంలో నెట్టుసంచులు అమాంతంగా అతడిపై పడ్డాయి. దీంతో సమీపంలో వున్న హమాలీలు వెంటనే బియ్యం సంచులను తొలగించారు. అయితే చాలా బరువు ఉన్న సంచులు మీద పడడంతో సుధకార్(35) అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటనతో హమాలీలు షాక్‌కు గురయ్యారు. సివిల్ సప్లయ్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.