క్రైమ్/లీగల్

సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఆరోపణలపై కేసు నమోదు చేశాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూన్ 17: పోలీసులు తనను తీవ్రంగా హింసించారంటూ సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ దాసరి నాగేంద్ర ప్రసాద్ బాబు చేసిన ఆరోపణలపై కేసు నమోదు చేశామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. ఆదివారం సాయంత్రం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల 11వతేదీన జరిగిన మసులా బీచ్ ఫెస్టివల్‌లో సందర్శకులతో అసభ్యకరంగా ప్రవర్తించటంతో పాటు సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ దాసరి నాగేంద్ర ప్రసాద్ బాబు, చిలకలపూడి సీఐ మధ్య వివాదం ఏర్పడిందన్నారు. విధి నిర్వహణలో ఉన్న సీఐ నాగేంద్ర ప్రసాద్ చర్యలను అడ్డుకోగా సీఐపై భౌతికదాడికి దిగారన్నారు. దీనిపై బందరు తాలుకా పోలీసు స్టేషన్‌లో సీఐ ఫిర్యాదు మేరకు సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్‌తో పాటు మరో ఇరువురిపై కేసు నమోదు చేసి 13వ తేదీన అరెస్టు చేసి 14వతేదీన కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. అరెస్టుకు ముందు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించగా మెడికల్ సర్ట్ఫికేట్ కూడా పాజిటీవ్‌గా వచ్చిందన్నారు. అయితే బెయిల్‌పై విడుదల అయిన అనంతరం నాగ ప్రసాద్ బాబు పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. ఈ ఆరోపణల మీద కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు పారదర్శకత కోసం అవనిగడ్డ డిఎస్పీకి బదలాయించినట్లు తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.