క్రైమ్/లీగల్

సముద్ర స్నానానికి వెళ్లి... ఇద్దరు నైజీరియా విద్యార్థులు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 17: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ వద్ద అదివారం సముద్రంలో స్నానం చేస్తూ నైజీరియా దేశానికి చెందిన ఇరువురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థుల్లో ఒకరి మృతదేహం తీరానికి కొట్టుకురాగా, మరో విద్యార్థి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడకు సమీపంలోని సూరంపాలెంలో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్న నైజీరియా దేశానికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు ఆదివారం సెలవురోజు కావడంతో ఉప్పాడ సముద్ర తీరానికి వచ్చారు. స్థానిక ఎస్‌పీజీఎల్ సమీపంలో సముద్రంలో దిగి స్నానం చేస్తున్నారు.
అయితే ఆ ప్రాంతం సురక్షితమైనది కాకపోవడం, అలల ఉద్ధృతి అధికంగా ఉండటాన్ని గమనించలేకపోయారు. సముద్రపు అలలు ఒక్కసారిగా ఎగసిపడటంతో ఇమ్మానుయేల్ (21) (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం), ఇబ్రహీం డానియో నోగో (19) (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం) సముద్రంలో కొట్టుకుపోయారు. సాయంత్రానికి ఇమ్మానుయేల్ మృతదేహం తీరానికి కొట్టుకొచ్చింది. నోగో ఆచూకీకై గజ ఈతగాళ్ళు గాలిస్తున్నారు. మిగిలిన ఆరుగురు విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్టు యు కొత్తపల్లి ఎస్సై కృష్ణమాచారి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
దానవాయిపేటలో మరొకరు గల్లంతు
కాగా ఇదే జిల్లాలోని తొండంగి మండలం దానవాయిపేట వద్ద సముద్రంలో మరో విద్యార్థి గల్లంతయ్యాడు. కాకినాడ నగరానికి చెందిన సల్మాన్ మదీనా (17) అనే విద్యార్థి సముద్రంలో స్నానం చేసేందుకు దిగి, అలల తాకిడికి కొట్టుకుపోయాడు. మదీనాతో పాటు మరో విద్యార్థి సముద్రంలో కొట్టుకుపోతుండగా సమీపంలో ఉన్న మత్స్యకారులు రక్షించారు. సల్మాన్ మదీనా కుటుంబ సభ్యులతో కలసి అన్నవరం వెళ్ళి తిరిగి కాకినాడ వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సంఘటనా స్థలిని తొండంగి ఎస్సై బి జగన్మోహన్‌రావు పరిశీలించారు. గజ ఈతగాళ్ళ సహాయంతో ఆచూకీకై గాలిస్తున్నారు.

చిత్రం..తీరానికి కొట్టుకువచ్చిన నైజీరియా విద్యార్థి మృతదేహం