క్రైమ్/లీగల్

అనుమానాస్పదంగా వివాహిత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏర్పేడు, జూన్ 17: ఓ వివాహిత ఉరివేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని ఇసుకతాగేలి పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఏర్పేడు పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రేణిగుంట పట్టణంలోని వడ్డిమిట్టకు చెందిన పద్మమ్మ, కృష్ణయ్య దంపతుల కుమార్తె స్వాతి (22)తో ఏర్పేడు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన చిట్టెమ్మ, లేట్ వెంకటయ్య దంపతుల కుమారుడు సురేష్‌తో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం స్వాతి ఉరేసుకొని మృతి చెందిందని భర్త స్థానికులతో చెప్పి పరాయ్యాడు. సమాచారం తెలుసుకున్న స్వాతి తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విగత జీవిగా పడి ఉన్న స్వాతిని చూసి వారు భోరున విలపిస్తూ, తమ కుమార్తెను భర్త సురేషే హత్య చేశాడని ఆరోపించారు. స్వాతిని ప్రతి రోజు పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురావాలని వేధించేవాడని తల్లిదండ్రులు చెప్పారు. సురేష్ చెడు వ్యసనాలకు బానిసై ప్రతి రోజు స్వాతిని చిత్రహింసలకు గురిచేసే వాడని తెలిపారు. స్వాతి శనివారం రేణిగుంట సంతకు వచ్చి సరుకులు తీసుకువస్తుండగా భర్త ఫోన్ చేసి మీ పుట్టింటికి వెళ్లి లక్ష రూపాయలు తీసుకొని రావాలని చెప్పాడన్నారు. దీంతో స్వాతి తమ ఇంటికి వచ్చి డబ్బులు ఇమ్మని అడిగిందని, ఇప్పుడు అంత డబ్బులు లేవని తాము చెప్పామన్నారు. ఈ విషయాన్ని స్వాతి తన భర్తకు చెప్పడంతో ఫోన్ కట్‌చేసి అర్ధగంట తర్వాత మళ్లీ ఫోన్ చేసి, ఇక్కడ బాకీల వాళ్లతో గొడవులుగా ఉన్నాయి, అర్జంటుగా రావాలని చెప్పాడన్నారు. ఇంతలో ఏమి జరిగిందో బిడ్డ ప్రాణాలు తీశాడని తల్లిదండ్రులు భోరున విలపించారు. పోలీసులు స్వాతి మృతికి గల కారణాలను చుట్టుపక్కల వారిని విచారించి నమోదు చేసుకున్నారు. స్వాతి ఉరివేసుకున్న తీరును చూస్తే ఆమె నిద్రిస్తుండగా భర్తే వైరుతో గొంతుకు బిగించి చంపేసి ఉరి వేసుకొని మృతి చెందినట్లు చిత్రీకరించినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సురేష్ తల్లి దుబాయ్‌లో ఉంటూ వీరికి డబ్బులు పంపేదన్నారు. గత కొంతకాలంగా సురేష్ ప్రవర్తనపై అనుమానంతో డబ్బులు పంపకుండా నిలిపి వేయడంతో అతను వ్యసనాలకు డబ్బు కరవైనట్లు తెలుస్తోందని స్థానికులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి సురేష్‌ను కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాతికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించనున్నట్లు డీఎస్పీ నజండప్ప, ఎస్సై వెంకటరమణ తెలిపారు