క్రైమ్/లీగల్

మార్కాపురం వ్యవసాయ కళాశాల విద్యార్థి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుంగనూరు, జూలై 17: పట్టణానికి చెందిన మహేష్(20) కళాశాలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తల్లిదండ్రులు తన కుమారుని మృతదేహానికి పుంగనూరు పట్టణంలో అంత్యక్రియలు నిర్వహించేశారు. కుమారుని స్నేహితుడు అదే తరహాలో ఈనెల 15న మృతిచెందాడు. దీనిపై మహేష్ తల్లికి కుమారుడి మృతిపై పలు అనుమానాలు రావడంతో ఈనెల 15న మార్కాపురం డిఎస్‌పి రామాంజునేయులకు తల్లి పద్మజ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై ఆదివారం మార్కాపురం ఎస్‌ఐ ముక్కంటి, పుంగనూరు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి మహేష్ మృతదేహాన్ని వెలికి తీసి శవ పంచనామా నిర్వహించారు. చిత్తూరుజిల్లా పుంగనూరు పట్టణం తాటిమాకులపాళెం ప్రాంతానికి చెందిన మధుసూదన్, పద్మజ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం, అందులో చిన్న కుమారుడు మహేష్ ఉన్నత చదువులకై నెల్లూరుజిల్లా మార్కాపురం వ్యవసాయ కళాశాలలో చేరి, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 12న మహేష్‌కు అనారోగ్యంగా ఉందని, తోటి స్నేహితులు, హాస్టల్ వార్డెన్‌లు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈవిషయం పుంగనూరు పట్టణంలోని తల్లిదండ్రులకు సమాచారం చేరవేశారు. తల్లిదండ్రులు కుమారుని మృతదేహాన్ని పుంగనూరుకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. మహేష్ స్నేహితుడు వివేక్‌చంద్ర అంత్యక్రియలకు హాజరైయ్యాడు. ఈనెల 15న వివేక్‌చంద్ర అదే తరహాలో మృతిచెందడం, కుమారుడు మహేష్ మృతిపై అనుమానాలు వచ్చిన తల్లి పద్మజ ఈనెల 16న మార్కాపురం డిఎస్‌పి రామాంజనేయులకు ఫిర్యాదు చేసింది. మార్కాపురం ఎస్‌ఐ ముక్కంటి తన సిబ్బందితో ఆదివారం పుంగనూరుకు చేరుకున్నారు. పుంగనూరు ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌తో కలసి స్మశానవాటికలోని మహేష్ మృతదేహానికి తహశీల్దారు మాధవరాజు, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి, విఆర్‌ఓలు శవపంచనామా నిర్వహించారు. పంచనామా నివేదికలు, వివిధ కోణాలలో దర్యాప్తు చేపడుతున్నట్లు మార్కాపురం ఎస్‌ఐ ముక్యంటి తెలిపారు. విచారణ, పోస్టుమార్టం నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని మార్కాపురం ఎస్‌ఐ వెల్లడించారు.