క్రైమ్/లీగల్

విదేశీయులకు పాస్‌పోర్ట్ తప్పనిసరి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఫిబ్రవరి 29: భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి విదేశీయులు పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండటం తప్పనిసరి కాదని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, వారు తమ దేశ పాస్‌పోర్ట్‌ను ఎందుకు కలిగి లేరో తగిన కారణాలను తెలియజేయవలసి ఉంటుందని పేర్కొంది. సిటిజెన్‌షిప్ రూల్స్ 2009లోని 11వ నిబంధన కింద అధికారులకు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉందని హైకోర్టు న్యాయమూర్తి సవ్యసాచి భట్టాచార్య తీర్పు ఇచ్చారు. పౌరసత్వం కోరుకుంటున్న దరఖాస్తుదారు తాను ఎందుకు పాస్‌పోర్ట్‌ను కలిగి లేరో వివరణ ఇస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ‘సిటిజెన్‌షిప్ దరఖాస్తులోని ఫామ్ 3లో గల క్లాజ్ 9 ప్రకారం దరఖాస్తుదారు పాస్‌పోర్టు వివరాలను నింపవలసి ఉంటుంది. చెల్లుబాటయ్యే విదేశీ పాస్‌పోర్టు సహా సంబంధిత పత్రాలను దరఖాస్తుకు జతచేయవలసి ఉంటుంది. ఫామ్ 3 ద్వారా సమర్పిస్తే తప్ప దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవడం జరుగదనే నియమాలు ఉన్నప్పటికీ, ఆ నిబంధనలు పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండటాన్ని తప్పనిసరి చేయలేదు’ అని హైకోర్టు పేర్కొంది. దరఖాస్తుదారులకు ఈ సడలింపు ఇవ్వకుంటే, చాలా కాలం నుంచి భారత్‌లో నివసిస్తున్న, భారతీయురాలిని వివాహం చేసుకున్న ఎలాంటి వంచనకు పాల్పడని వారు కూడా భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోజాలరని హైకోర్టు పేర్కొంది. ఇలాంటి వారు భారత ఆర్థిక వ్యవస్థకు, ఈ దేశ భిన్న సంస్కృతికి తమ వంతు సేవ చేస్తూ కూడా ఈ దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోజాలరని తెలిపింది. ఇది రాజ్యాంగంలోని 14వ అధికరణం స్ఫూర్తికే విరుద్ధమని కలకత్తా హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. సిటిజెన్‌షిప్ రూల్స్ 2009లోని ఫామ్ 3లో పాస్‌పోర్ట్‌ను కలిగి ఉండటం అవసరం అనే అంశాన్ని ఐచ్ఛికమని మాత్రమే భావించవలసి ఉంటుందని హైకోర్టు వివరించింది.