క్రైమ్/లీగల్

నిద్దురోతున్న నిఘా నేత్రాలు.. చెలరేగిపోతున్న నేరస్థులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 29: నగరంలో నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. దోపిడీ దొంగలు ఎలాంటి బెరుకు లేకుండా దోపిడీలు, హత్యలు చేస్తూ దర్జాగా తప్పించుకు తిరుగుతున్నారు. గతంలో నగరంలో ఏమూల ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా కారకులను పోలీసులు వెంటనే పట్టుకునేవారు. సీసీ కెమెరాల ఫూటేజీలు వారికి ఆధారాలు అందించేవి. ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కె మెరాల వల్ల ట్రాఫిక్ నిబంధనలు ఉ ల్లంఘించిన వాహనదారులకు సైతం ఈ-చలానాలు ఇంటికి వచ్చేవి. అ లాంటి పరిజ్ఞానంతో నగరం మొత్తం నిఘా నేత్రాల పర్యవేక్షణలో ఉండేది. అలాంటి కెమెరాలు నేడు పనిచేయ డం లేదు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల విషయంలో కూడా కక్కుర్తి పడిందనే ఆ రోపణలతో సదర సీసీ కెమెరా సంస్థ ను పక్కన పెట్టేశారు. అయితే వైకాపా ప్రభుత్వం ఈ విషయంలో కొత్తగా చేసిందేమీ లేదు. ప్రతి చిన్న విషయంలోనూ సీసీ కెమెరాలపై ఆధారపడిన నగర పోలీసులు ఎన్నో సంచలన కే సులను త్వరితగతిన ఛేదించిన సందర్భాలున్నాయి. గత డిసెంబర్ 31న భ వానీపురంలో జరిగిన యేదుపాటి ప ద్మావతి హత్య కేసులో ఎదురింటి లా యర్ ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా ల సాయంతో పోలీసులు నిందితుడి ని గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ నెల 20 న చిట్టినగర్ కుండల మార్కెట్ సమీపంలోని తాపీమేస్ర్తి ఏసు ఇంటిలో పట్టపగలే దోపిడీకి పాల్పడిన దొంగ ను అదే ప్రాంతంలోని లలితా బార్ వారి సీసీ కెమెరాల ఫుటేజీల సాయంతోనే గుర్తించారు.