క్రైమ్/లీగల్

దయ్యాల వాగు వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, జనవరి 23: జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం దయ్యాలవాగు సమీపంలో గురువారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గద్వాల పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాలకు చెందిన ఓ మిత్రుని కుటుంబ సభ్యుల ఎన్నికల కోసం ఇక్కడికి వచ్చిన నలుగురు స్నేహితులు హైదరాబాద్‌కు వెళ్తుండగా దయ్యాలవాగు వద్ద చెరకు లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొట్టారు. టీఎస్06ఈసీ 6161 నంబర్ గల స్విఫ్ట్‌కారులో ప్రయాణిస్తున్న జమ్మిచేడుకు చెందిన కిరణ్ (25), అలంపూర్ మండల పరిధిలోని లింగనవాయి గ్రామానికి చెందిన విజయ్‌కుమార్ (26), బైరాపురం గ్రామానికి చెందిన సునీల్ (30) అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవింగ్ చేస్తున్న పవన్ తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. పంచనామా నిర్వహించి మృతదేహాలను ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలపాలైన పవన్ కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయాన్ని తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం గద్వాల ఏరియా ఆసుపత్రికి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.