క్రైమ్/లీగల్

మోడల్‌స్కూల్ విద్యార్థినిపై అధ్యాపకుడి అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, జనవరి 18: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు.. కామకర్కశంతో ఓ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన శనివారం మదనపపల్లె పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూసింది. మదనపల్లెకు చెందిన 14ఏళ్ళ విద్యార్థిని బి.కొత్తకోట మోడల్ పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటోంది. నగరికి చెందిన నవీన్‌కుమార్(26) అదే స్కూలులో తెలుగు అధ్యాపకులుగా చేరాడు. మదనపల్లె రెండవ పట్టణ సీఐ రవీంధ్రనాధ్‌యాదవ్ కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి... చిత్తూరుజిల్లా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె చేనేత పేద కుటుంబానికి చెందిన ఓ విద్యార్థిని బి.కొత్తకోట మండలం మోడల్ పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటోంది. ఇటీవల సంక్రాంతి సెలవులు రావడంతో బాలిక తన సొంతూరు మదనపల్లె వెళ్లింది. అదే స్కూలులో తెలుగు అధ్యాపకుడుగా ఉన్న నవీన్‌కుమార్(26) ఆయన చిన్నమ్మ ఇంటికి మదనపల్లె వెళ్లాడు. తనకున్న చనువుతో విద్యార్థినిని తన చిన్నమ్మ ఇంటివద్దకు రప్పించుకున్నాడు. ఇదే అదునుగా ఎవరూ లేనిసమయంలో విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. జరిగిన విషయం విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పింది. బాధితుల ఫిర్యాదుపై రేప్, ఫోక్స్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.