క్రైమ్/లీగల్

కేసు డైరీ మాయం.. తీర్పు వాయిదా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్ దేహత్, జనవరి 18: బందిపోటు రాణి ఫూలన్ దేవి గ్యాంగ్ బెహ్‌మయి ఊచకోత ఘటనకు సంబంధించి ‘కేసు డైరీ’ మాయం అయింది. దీంతో శనివారం వెలువడాల్సిన తీర్పు 24కు వాయిదా పడింది. ఆసక్తికరమైన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బందిపోటు రాణి ఫూలన్‌దేవీ గ్యాంగ్ అరాచకాలకు అడ్డూఅదుపుఉండేది కాదు. ఫూలన్ దేవి ముఠా సభ్యులు సుమారు నాలుగు దశాబ్దాల క్రితం జరిపిన ఊచకోతలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసు విచారణ ప్రత్యేక కోర్టులో ముగిసింది. తీర్పు శనివారం విడుదల కావల్సి ఉంది. అయితే బెహ్‌మయి ఊచగోత కేసులో ఒరిజనల్ కేసు డైరీ కనిపించకుండా పోయింది. డైరీ మాయం విషయం వెలుగుచూడడంతో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సుధీర్ కుమార్ తీర్పు ప్రకటన ఈనెల 24కు వాయిదా వేశారు. తీర్పు వెలువడే రోజునే కేసు డైరీ కనిపించడకుండా పోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఊచకోత కేసులో ఫూలన్ దేవి ముఠా సభ్యులైన బందిపోట్లు పోషా, భిఖా, విశ్వనాథ్, శ్యాంబాబుపై న్యాయమూర్తి తీర్పును ఇవ్వాల్సి ఉంది. పోషా ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. మిగతా ముగ్గురు బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. మాన్‌సింగ్‌తో పాటు మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఇలా ఉండగ ఒరిజనల్ కేసు డైరీ మాయం విషయం జడ్జికి దృష్టికి రావడంతో తీర్పును వాయిదా వేయాల్సి వచ్చిందని ప్రభుత్వ న్యాయవాది(క్రైం) రాజీవ్ పోర్వాల్ వెల్లడించారు. కోర్టు రికార్డుల్లోంచి డైరీ గల్లంతైందని ఆయనో వార్తా సంస్థకు చెప్పారు. దీంతో తీర్పు ప్రకటన 24కు వాయిదా పడిందని ఆయన పేర్కొన్నారు. తదుపరి వాయిదా రోజుకు కేసు డైరీ వెతికి పట్టుకురావాలని కోర్టు సిబ్బందిని జడ్జి ఆదేశించారని పోర్వాల్ వెల్లడించారు. ఒరిజనల్ కేసు డైరీ దొరకని పక్షంలో మరో తేదీకి కేసు వాయిదా పడే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేసు డైరీ మిస్సింగ్‌కు సంబంధించి సెషన్స్ గుమాస్తాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. డైరీ ఎక్కడికి పోయిందీ వెతికి పట్టుకురమ్మని ఆదేశాలు ఇచ్చింది. లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినట్టు ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారు. కేసు డైరీ మాయమైన సంగతి ఇటీవలే బయటపడినట్టు ఆయన తెలిపారు.
కాగా కేసు డైరీ మాయం వెనక ఎలాంటి కుట్ర లేదని పార్వాల్ చెప్పుకొచ్చారు. 20 మంది మృతికి కారణమైన కేసుకు సంబంధించి తీర్పులో విపరీతమైన జాప్యం చోటుచేసుకుంటోందని కాబట్టి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఓ న్యాయవాది కోరారు. తీరా తీర్పు వెలువడే సమయంలో కేసు డైరీ కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది.