క్రైమ్/లీగల్

భారీ జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: బల్దియా నిబంధనలను ఉల్లంఘించిన ఏడు సంస్థలపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కొరడా ఝుళిపించింది. వివిధ రకాలుగా నిబంధలను ఉల్లంఘించి అక్రమంగా ఫ్లెక్సీలు, కటౌట్‌లు, పోస్టర్లను ఏర్పాటు చేసిన ఏడు సంస్థలను గుర్తించి వాటికి రూ. 1.48 కోట్ల వరకు జరిమానాలు విధించినట్లు ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. ఇప్పటి వరకు 44వేల 403 అతిక్రమణల ఫొటోలను సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ మొబైల్ ద్వారా అందినట్లు తెలిపారు. 2019 అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 8లక్షల 60వేల 755 పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించినట్లు తెలిపారు. ఈ సెల్ ద్వారా ప్రతి ఆక్రమణకు ఫొటోను జియోట్యాగింగ్ చేసే యూనిక్ నెంబర్‌ను ఇచ్చి తదుపరి చర్యలకై మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. శనివారం జరిమానాలు విధించిన ఏడు సంస్థల వివరాలిలా ఉన్నాయి. వీటిలో ది బ్రిటీష్ స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థకు రూ. 33లక్షల 62వేలు, ది రాపిడో బైక్ ట్యాక్సీకిరూ. 13లక్షల 79వేలు, ది నేచురల్ హెయిర్ ట్రీట్‌మెంట్ రూ.39లక్షల 56వేలు, ది వెంకట్ జాబ్ ఇన్ ఎంఎన్‌సీ రూ. 29.44లక్షలు, ది బిల్ సాఫ్టు టెక్నాలజీస్ రూ.9లక్షల 38వేలు, యాక్టు ఫైబర్ నెట్‌కు రూ. 14.19లక్షలు, ది హాత్‌వే బ్రాండ్‌కు రూ. 8లక్షల 13వేల జరిమానాలు విధించినట్లు, మొత్తం రూ. కోటి 48లక్షల 11వేల జరిమానాలు విధించినట్లు తెలిపారు. నగరంలో ఎక్కడబడితే అక్కడ చెత్త చెదారం, భవన నిర్మాణ వ్యర్థాలను వేసే వ్యక్తులను కూడా గుర్తించి సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ద్వారా జరిమానాలను విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. యాప్ ద్వారా పౌరులు ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా, తమకు ఫొటోల ద్వారా సమాచారం పంపవచ్చునని ఆయన వివరించారు.