క్రైమ్/లీగల్

కోడిపందాల్లో అపశ్రుతి: కత్తి తగిలి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతలపూడి, జనవరి 16: పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తుండగా కోడికత్తి తగిలి గాయమై వ్యక్తి మృతిచెందాడు. ఈ బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. కోడిపందాలు నిర్వహిస్తున్న సందర్భంలో సిహెచ్ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కోళ్లకు కత్తులు కడుతూ ఉంటాడు. ఈ సందర్భంలో ఒక కోడికి కత్తికట్టి వదలగా అది ఎగిరి గంతులేయగా మర్మాంగం వద్ద తెగి గాయం కావటంతో చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఈ సంఘటన నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కోడిపందాలను అరికట్టాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రతి గ్రామంలో కోడిపందాలు యధేచ్ఛగా నిర్వహించారు.