క్రైమ్/లీగల్

పిడుగుపాటుకు ఐదుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతలో ఇద్దరు, కర్నూలులో ఒకరు, కర్నాటకలో ఇద్దరు
ఉసురుతీసిన అకాల వర్షాలు
నల్లమాడ/ బనగానపల్లె/ చిలమత్తూరు, ఏప్రిల్ 2: అల్పపీడన ద్రోణితో రెండు రోజులుగా కురిసిన వడగళ్లవాన ఆస్తి నష్టానే్న కాదు, పిడుగులు కురిపించి ప్రాణ నష్టాన్నీ మిగిల్చింది. గత 48 గంటల్లో పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు మహిళలు, కర్నూలు జిల్లాలో ఒకరు, కర్నాటకలో ఇద్దరు రైతులు మృతి చెందారు. అనంత జిల్లా పెమనకుంటపల్లికి చెందిన అమరమ్మ (48), లక్ష్మీదేవి (30) పిడుగుపాటుతో సోమవారం మృతి చెందారు. గ్రామానికి చెందిన కిష్టప్ప, అమరమ్మ దంపతులు పొలంలో పనిచేస్తుండగా మధ్యాహ్నం 2-40 గంటల సమయంలో వర్షం రావడంతో సమీపంలోని చింతచెట్టు కిందకు చేరారు. అక్కడే గొర్రెలు మేపుతున్న లక్ష్మీదేవి, అదే గ్రామానికి చెందిన నర్సిరెడ్డి చెట్టుకిందకు చేరారు. కొద్ది సేపటికే పెద్ద శబ్ధంతో పిడుగు చింతచెట్టుపై పడటంతో అమరమ్మ, లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందారు. కిష్టప్ప, నర్సిరెడ్డి గాయాలపాలయ్యారు. ఇద్దరినీ గ్రామస్తులు ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పాతపాడు గ్రామంలో పిడుగు పడి బోయ సంజన్న (58) మృతి చెందాడు. సంజన్న జ్వాలాపురం గ్రామంలోని పొలాల్లో గొర్రెలను మేపుతుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలానికి సమీపంలోని కర్నాటక రాష్ట్రం మార్గానికుంట మండలం ఎస్.కొత్తపల్లి గ్రామంలో పిడుగుపడి ఇద్దరు రైతులు నరసింహప్ప (62), సదాశివ (55) మృతి చెందారు. రైతులిద్దరూ సోమవారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వర్షం కురవడంతో సమీపంలోని చింతచెట్టు కింద ఉన్న గంగమ్మ గుడిలో తలదాచుకొన్నారు. పెద్ద శబ్ధంతో చెట్టుపై పడిన పిడుగు గుడిలోపలికి చొచ్చుకురావడంతో రైతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.