బిజినెస్

బొగ్గు ఉత్పత్తిలో 24 శాతం వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదాం సింగరేణి కార్మికులకు సిఎండి శ్రీధర్ పిలుపు
హైదరాబాద్, డిసెంబర్ 31: సింగరేణి కాలరీస్ కంపెనీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డిసెంబర్ నాటికి బొగ్గు ఉత్తత్తిలో 24 శాతం వృద్ధి సాధించిందని ఆ కంపెనీ సిఎండి ఎన్.శ్రీధర్ తెలిపారు. బొగ్గు ఉత్తత్తిలో వృద్ధి సాధించడమే కాకుండా అవసరానికి మించి ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయడం వల్ల విద్యుత్ ఉత్పాదనలోనూ గణనీయమైన వృద్ధి సాధించగలుగుతున్నామని ఆయన తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన సంవత్సరంలో కూడా ఇదే తరహాలో ప్రతి ఒక్కరూ పని చేసి మరింత సంస్థ వృద్ధికి దోహదపడాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత సింగరేణి సంస్థ బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. బాగా పని చేయడం వల్లే ఈ ఏడాది 21 శాతం లాభాలను బోనస్‌గా పొందగలిగామని అన్నారు. అలాగే పండుగ అడ్వాన్స్ 16 వేల నుంచి 18 వేలకు పెంచుకోగలిగామని తెలిపారు. మరింత కష్టపడి పని చేసి కంపెనీ వృద్ధికి సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద నిర్మిస్తున్న 1200 మెగావాట్ల విద్యుత్ కర్మాగారం నిర్మాణం చివరి దశకు చేరుకుందని అన్నారు. సిఎం ప్రత్యేక శ్రద్ద చూపుతూ ఇప్పటికే రెండు సార్లు ప్లాంటును సందర్శించారని అన్నారు. 2016 మార్చి నాటికి పూర్తి చేసి మన కలను సాకారం చేసుకుందామని శ్రీధర్ వెల్లడించారు.