చిత్రాంగదకు అంజలి పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న సినిమా ‘చిత్రాంగద’. శ్రీవిఘ్నేక్ కార్తిక్ సినిమా అండ్ క్రియేటివ్ ద్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ సంయుక్తంగా అశోక్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం కథానాయిక అంజలి ‘డింగ్ డాంగ్’ అంటూ ఓ పాటను ఆలపించడం విశేషం. సెల్వగణేశన్ పాటను రాయగా స్వామినాధన్ సంగీత దర్శకత్వంలో పాటను రికార్డు చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ జోనర్‌లో సినిమా రూపొందిందని, సినిమాలో వున్న ట్విస్టులు ప్రేక్షకులకు షాక్‌నిస్తాయని చెప్పారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా సాగే ఈ చిత్రంలో అంజలి పాడిన పాట హైలెట్‌గా వుంటుందని, తెలుగుతోపాటు తమిళంలో కూడా అంజలి పాడిందని ఆయన తెలిపారు. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా కథానాయిక జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? ఆమెకు ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించింది? అన్న ఇతివృత్తంతో లేడీ ఓరియెంటెడ్ కథ కథనంతో ఈ సినిమా రూపొందించామని, కథానుగుణంగా అమెరికాలోని పలు అందమైన లొకేషన్లలో కీలక ఘట్టాలు చిత్రీకరించామని వారు తెలిపారు. ఈనెలాఖరులో ఆడియోను, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సింధు తులాని, సప్తగిరి, రక్ష తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్:ప్రవీణ్ పూడి, కెమెరా:బాల్‌రెడ్డి, నిర్మాతలు:గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:అశోక్.జి.