భలే చాన్స్!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిషకు -చాన్స్‌లు లేవనేవాళ్లు కొందరు. త్రిషకు -సూటయ్యే కథలే రావడం లేదనేవాళ్లు ఇంకొందరు. ఏమైతేనేం -స్క్రీన్‌మీద త్రిష అప్పుడప్పుడే కనిపిస్తోంది. కనిపించిన ప్రతి ప్రాజెక్టులోనూ అదే అట్రాక్షన్ ఇవ్వగలుగుతుంది. గత ఏడాది 96 ప్రాజెక్టు చేసింది త్రిష, ఆ పాత్రను ఆమె తప్ప మరెవ్వరూ చేయలేరన్నంతగా. నిజానికి తెలుగులో ఒకప్పుడు త్రిష టాప్. ఆ మాటకొస్తే తమిళంలోనూ హవా చూపించింది. ఎప్పటికీ టాప్ పొజిషన్‌లో ఉండటం ఎవ్వరికీ సాధ్యం కాదుకనుక.. ఆ విషయం టాప్ ప్లేస్ రుచిచూసిన త్రిషకూ తెలుసుకనుక -వస్తున్న చాన్స్‌లతోనే ముందుకెళ్తోంది త్రిష. ఈ ఏడాది రజనీ సంక్రాంతి సినిమా పేటలో కనిపించిన త్రిషకు మరో బంపర్ ఆఫర్ తగలనుందన్నది ఇండస్ట్రీ టాక్.
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించనున్న భారీ పీరియాడిక్ మూవీ పొన్నియన్ సెల్వంలో ఓ పాత్ర కోసం త్రిషను తీసుకునే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారట. అధికారిక సమాచారం కాకున్నా.. ఆ పాత్ర త్రిష ఖాతాలోనే పడటం ఖాయమన్నంత గట్టిగా చెబుతున్నారు. పొన్నియన్ సెల్వంలో ఐశ్వర్యరాయ్, కార్తీ, జయం రవి, మోహన్‌బాబులాంటి భారీ కాస్ట్‌ని ఎంపిక చేసుకున్నాడు మణిరత్నం. కల్కి కృష్ణమూర్తి రాసిన చోళుల చరిత్ర నవల ఆధారంగా తెరకెక్కనున్న సినిమా ప్రీ పొడక్షన్స్‌లో ఉంది. త్రిష కోసమే అన్నట్టన్న కథ రావడమంటే ఇదే మరి. ఇటు తెలుగులో చిరంజీవి 152 ప్రాజెక్టులోనూ త్రిషకు చాన్స్ దక్కే అవకాశం ఉందన్నది కొద్దికాలంగా వినిపిస్తోన్న మాట.