ఎమోషనల్ ఖైదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడియన్స్ నానుంచి డిఫరెంట్ సినిమా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అలాంటి సినిమాలు అన్ని సందర్భాల్లోనూ కుదరవు. ఖైదీలాంటి చిత్రం చాలా రేర్‌గా దొరుకుతుంది. పదేళ్లు జైల్లో గడిపి బయటికొచ్చిన ఖైదీ.. ఎలా ఉంటుందో తెలీని కూతుర్ని కలిసేందుకు వెళ్తున్న టైంలో -ఏం జరిగిందన్నదే కథ. సినిమా మొత్తం నాలుగ్గంటల కథనం.
యాక్షన్, ఎమోషనల్
కలగలిపి చూస్తారు.
*
కార్తి హీరోగా డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తోన్న చిత్రం -ఖైదీ. లోకేష్ కనకరాజ్ దర్శకుడు. తమిళం, తెలుగు భాషల్లో దీపావళిని టార్గెట్ చేస్తూ వస్తోన్న చిత్రం. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన కార్తి మీడియాతో మాట్లాడాడు.
పదేళ్ల జైలు జీవితం ముగించి బైటికొచ్చిన ఖైదీ ఆది శంకరం పాత్ర చేస్తున్నా. అతనికొక కూతురుంటుంది. కానీ, ఎలా ఉంటుందో కూడా చూసుండడు. కూతుర్ని చూడ్డానికి వెళ్తున్న ఖైదీ తండ్రికి ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి? ఆమెను చూశాడా? లేదా? అన్న కోణంలో సినిమా ఉంటుంది.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ షార్ట్ ఫిల్మ్స్ చేసి ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు. తొలి చిత్రంతోనే పెద్ద హిట్టందుకున్నాడు. చిన్న ఫిల్మ్ కథ వుంది, నచ్చుతుందేమో వినండి అంటూ వచ్చాడు. ఐడియా విన్న తరువాత నాకు గూస్‌బంప్స్ వచ్చాయి. ఇదొక మాస్ ఎలిమెంట్స్‌వున్న బిగ్ యాక్షన్ ఫిల్మ్. అలాగే చేద్దాం అన్నాను. అనుకున్నట్టే సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో భారీ ప్రాజెక్టు చేశాం. కథ మొత్తం ఓ రాత్రి నాలుగ్గంటల్లో ముగుస్తుంది.
రియల్ లైఫ్‌లో నాకూ ఓ కూతురుంది. కథలోలాంటి సందర్భం రియల్ లైఫ్‌లో ఎవరికైనా ఎదురైతే? అన్న ఆలోచన వచ్చినపుడు కదిలిపోయాను. యాక్షన్, ఎమోషన్ రెండూ ఆడియన్స్‌కి బాగా కనెక్టవుతాయని నమ్మి చేసిన సినిమా.
ట్రైలర్‌లో చూపించిన డైలాగ్స్‌కే మంచి రెస్పాన్స్ ఉంది. సినిమాలో అలాంటివి మరిన్ని ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాయ. ఇదొక న్యూ ఏజ్ యాక్షన్ ఫిల్మ్. టీం అంతా కొత్తవాళ్లు కనుక -వాళ్లు సీన్ రాసినా, డైలాగ్ రాసినా ఒరిజినల్ లైఫ్‌నుంచి ఇన్‌స్పైరై రాస్తున్నారు. ఆ ఫ్రెష్ ఫీలింగ్ సినిమాలో ఉంటుంది.
ఈ సినిమా కోసం నిజమైన ఖైదీలను కలిశాం. వాళ్లనుంచి కొత్త విషయాలు తెలుసుకున్నాం. చాలాకాలం జైల్లోమగ్గిన ఖైదీలు బయటికొచ్చాక వైట్ కలర్ చూడగానే చాలా ఆనందం కలుగుతుందని చెప్పారు.
లవ్, రొమాన్ అన్న పదాలకు ఈ సినిమాలో తావులేదు. కథ అలాంటిది. నాలుగ్గంటల్లో జరిగే కథ. అందుకే -అలాంటివి లేకుండానే దర్శకుడు సినిమాను డిజైన్ చేశాడు.
నైట్ టైంలో జరిగే కథ కనుక -సినిమా మొత్తం నైట్‌లోనే ఉంటుంది. దీనికోసం 60 నైట్స్ వర్క్ చేశాం. నా అదృష్టం కొద్దీ నేను పని చేసిన దర్శకులంతా టాలెంటెడ్. ఈ సినిమా తరువాత లోకేష్ కనకరాజ్‌కు విజయ్‌తో ప్రాజెక్టు పడింది.
తరువాతి ప్రాజెక్టులంటే -జీతూ జోసెఫ్‌తో ఓ ఫ్యామిలీ థ్రిల్లర్ చేస్తున్నా. అందులో నా వదిన జ్యోతిక కూడా నటిస్తోంది. మంచి కథ.