తెలుగుకి సిద్ధికీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు బాలీవుడ్ చాన్స్ కోసం ప్రాంతీయ భాషా నటులు అర్రులు చాచే పరిస్థితి ఉండేది. ఇప్పుడు సీన్ మారింది. కానె్సప్ట్, మేకింగ్ విషయాల్లో బాలీవుడ్ రేంజ్‌ని సౌత్ సినిమాలు దాటేస్తుందడటంతో -బాలీవుడ్ ఫోకస్ మొత్తం సౌత్‌వైపు మళ్లుతోంది. ఇక్కడ ఒక్క సినిమా హిట్టయితే, ఠక్కునవాలిపోయి రైట్స్ సొంతం చేసుకుంటున్నారు. మరోపక్క బాలీవుడ్ స్టార్స్ సైతం -ప్రాంతీయ భాషా చిత్రాల్లో చాన్సొస్తే నో అనకుండా చేసేస్తున్నారు. సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాలు రూపుదిద్దుకుంటున్న తరుణంలో -బాలీవుడ్ బిగ్ స్టార్స్ సైతం ఇక్కడి రీజినల్ స్క్రీన్స్‌పై కనిపించేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు. మొన్నొచ్చిన సాహో, తరువాత వచ్చిన సైరా చిత్రాల్లో జాకీష్రాఫ్, అమితాభ్ బచ్చన్ ‘స్పెషలైజ్జ్’ క్యారెక్టర్లలో మెప్పించడాన్ని చూశాం. నానాపటేకర్, సునీల్‌శెట్టి, సంజయ్‌దత్ లాంటి స్టార్స్ సౌత్ సినిమాపై ఫోకస్ పెట్టడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మంచి పెర్ఫార్మర్‌గా తక్కువ టైంలో మంచి పేరు తెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్ధకీ తెలుగుకు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు గట్టిగా వినిపిస్తోంది. సీనియర్ హీరో వెంకటేష్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోబోయే ప్రాజెక్టులో నవాజుద్దీన్‌ను ఓ ప్రత్యేక పాత్రలో చూపించేందుకు సంప్రతింపులు జరుపుతున్నట్టు సమాచారం. ట్రెండ్‌లో భాగంగా సౌత్ సినిమాలపై ఆసక్తి చూపిస్తోన్న నవాజుద్దీన్ -ఈ సినిమాను సైన్ చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. నవాజుద్దీన్ ఓకే అంటే -తెలుగుకు మరో గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికినట్టే.