భయంతో.. నవ్వుతారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీవీ యాంకర్ నుంచి దర్శకుడైన ఓంకార్ నుంచి వస్తోన్న తాజా సీక్వెల్ -రాజుగారి గది 3. అవికాగోర్, అశ్విన్ బాబు హీరో హీరోయిన్లు. రాజుగారి గదికి సీక్వెల్‌గా వస్తున్న సినిమా అక్టోబర్ 18న థియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా హీరో అశ్విన్ మీడియాతో మాట్లాడాడు.
రాజుగారి గది 3 నేపథ్యం?
రాజుగారి గది సినిమా చేస్తున్నపుడు టు, త్రీ ఉంటాయనుకోలేదు. మొదటి పార్ట్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో -సీక్వెల్‌కు నాగార్జున, సమంత సపోర్ట్ దొరికింది. అందులో నేనూ భాగమయ్యాను. పార్ట్ 2లో ఎంటర్‌టైనె్మంట్ తగ్గిందన్నారు కనుకే -అది ఫుల్‌ఫిల్ చేస్తూ పార్ట్ 3 తెస్తున్నాం.
థర్డ్ పార్ట్ కామేడీ కోసమేనా?
కేవలం హార్రర్ కామెడీ కోసం. చాలా ఫన్నీగా ఉంటుంది. ఆలీ, బ్రహ్మాజీ, ఊర్వశిలాంటి సీనియర్లు ఉన్నారు. మంచి కథతో ఆడియన్స్‌ని రీచవ్వాలని ప్రయత్నిస్తున్నాం. ప్రతి హారర్ సీన్‌కీ భయపడటం కంటే పగలబడి నవ్వుకోవడం ఖాయం.
సినిమాటోగ్రఫీ..
చోటా కె నాయుడు పెద్ద టెక్నీషియన్. ఆయనే సినిమాకు బలం. జూన్‌లో మొదలైన సినిమా అక్టోబర్‌లో ఆడియన్స్ ముందుకొస్తుందంటే -ఆయన కారణంగానే. సోషియోఫాంటసీ అంజి చేశారు కానీ, హార్రర్ కామెడీ చేయడం చోటాకు ఇదే ఫస్ట్ టైమ్. ఆయనకూ చాలెంజే.
సేమ్ సబ్జెక్ట్.. బోర్ కాదా?
ప్రతి పార్ట్‌కీ కథలు వేరు. సో, బోర్ ప్రసక్తే ఉండదు. ఆడియన్స్ ఎంటర్‌టైన్ అవుతున్నారు. ఇది సక్సెస్ అయితే, పార్ట్ 4 ఉంటుందేమో.
మీ కెరీర్‌కు..
ఆర్టిస్టుగా ఇప్పటి వరకూ నన్ను గుర్తుపెట్టుకునే పాత్రలైతే చేయలేదు. పార్ట్ 3లో ఆడియన్స్‌కి బాగా కనెక్టయ్యే ఫుల్‌లెంగ్త్ మాస్ క్యారెక్టర్ చేస్తున్నా. పాటలు, డ్యాన్స్‌లు, యాక్షన్ సీక్వెన్స్.. అన్నీ ఉంటాయి. సినిమా విడుదల కోసం నాకూ ఎగ్జయిట్‌గానే ఉంది.
నెక్స్ట్ సినిమాలు?
మూడు నాలుగు కథలున్నాయి. గోదా అనే మళయాల సబ్జెక్ట్ విన్నా. ఏడాదిన్నరగా అందరి హీరోలదగ్గర తిరిగి నా దగ్గరికి వచ్చింది. చోటా కె నాయుడు, ఓంకార్ విని.. ఆ తర్వాత నాకు చెప్తానన్నారు. చూడాలి ఏమవుతుందో.

పొట్ట చెక్కలే..!!

రాజుగారి ‘మూడో’ గదిలోకి అడుగుపెడితే -పొట్ట చెక్కలవ్వడం ఖాయమంటున్నాడు కమెడియన్ అలీ. ఆలీ కితకితలు పెట్టనున్న రాజుగారి గది 3 సినిమా అక్టోబర్ 18న థియేటర్లకు వస్తున్న నేపథ్యంలో -ఆదివారం మీడియాతో మాట్లాడాడు.
నా కెరీర్‌లో ఇదో ప్రత్యేకమైన సినిమా. అన్ని ఎమోషన్స్ ఉన్న పాత్ర చేశా. పైగా ఎక్కువ భాగం నైట్ అఫెక్ట్‌లో ఉంటుంది.
రాజుగారి గది 1, 2ల్లో అశ్విన్ పాత్ర వేరు. ఈ సినిమాలో అశ్విన్ పాత్ర పూర్తిగా మారిపోయింది. హీరోగా అశ్విన్ మరో మెట్టెక్కడం ఖాయం.
ఏ విషయంలోనైనా ఓంకార్ ఓ క్లారిటీతో ఉంటాడు. దర్శకుడిగానూ ఏ ఆర్టిస్టునుంచి ఏంకావాలో అది రాబట్టాడు. పక్కా ప్లానింగ్‌తో చేసిన సినిమా. రాజుగారి గదిని థర్డ్ లెవెల్‌కు తీసుకెళ్లడంలో -చోటా కె నాయుడు పెద్ద అస్సెట్ అనడంలో సందేహం లేదు.
రాజుగారి మూడో గదిని చూడ్డానికి వచ్చిన ప్రేక్షకుడు నవ్వి నవ్వి ఎంజాయ్ చేయటం గ్యారెంటీ. ఓంకార్, అతని తమ్ముళ్లు కల్యాణ్, అశ్విన్ పడిన కష్టానికి కచ్చితంగా ఫలితం దక్కుతుంది.

-‘వి’