మళ్లీ మళ్లీ.. చూడాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిషి క్రియేషన్స్ పతాకంపై అనురాగ్ కొణిదెన హీరోగా హేమంత్ కార్తీక్ తెరకెక్కిస్తోన్న చిత్రం -మళ్లీ మళ్లీ చూశా. కె కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రంలో శే్వత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లు. సెన్సార్ నుంచి యు/ఎ సర్ట్ఫికెట్ పొందిన సినిమా అక్టోబర్ 18న థియేటర్లకు వస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
* మాది కృష్ణా జిల్లా. నేను క్రిషి కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌ని. మా అబ్బాయి అనురాగ్ చురుకైనవాడు. ఇంజినీరింగ్ పూర్తిచేసి వ్యాపారంలో తోడుగా ఉండేవాడు. రామానాయుడు యాక్టింగ్ స్కూల్‌లో ఆరునెలలు ట్రైనింగ్ తీసుకొని -మూవీ చేస్తానన్నాడు. ఒక కథ అనుకుని ప్రొడ్యూసర్‌తో నా దగ్గరకు వచ్చాడు. కొన్ని కారణాల వల్ల ఆ నిర్మాత వెనక్కి వెళ్లిపోవడంతో -మావాడి కలను నెరవేర్చడానికి నేనే నిర్మాతనయ్యా.
* అనురాగ్ మంచి హీరో అనిపించుకుంటాడన్న నమ్మకం ఉంది. ఎందుకంటే -చదువులో ఫస్ట్. డిసిప్లిన్‌లో బెస్ట్. మావాడు ఒక మాట చెబితే అందులో విషయం ఉండిఉంటుంది. అదే నా నమ్మకం.
మళ్లీ మళ్లీ చూశా.. -స్టూడెంట్స్ లైఫ్‌కి సంబంధించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఒక స్టూడెంట్ తనకి దొరికిన డైరీతో ఎన్ని ఇబ్బందులు అధిగమించి అమ్మాయి ప్రేమను గెలుచుకున్నాడు అన్నదే కథ. గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ఫ్యామిలీస్‌కీ కనెక్టవుతుంది.
* సినిమాని ఓన్‌గా రిలీజ్ చేస్తున్నాం. ఏరియా వైజ్‌గా మంచి డిస్ట్రిబ్యూటర్లను ఎంపిక చేశాం. హీరో కావాలన్న మావాడి కల నెరవేరుతున్నందుకు హ్యాపీగా ఉంది.
* భవిష్యత్‌లో ఇదే బ్యానర్‌లో మరిన్ని సినిమాలు నిర్మించాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం రెండు మూడు కథలు పరిశీలనలో ఉన్నాయి. మంచి చాన్స్ కోసం ఎదురుచూసే టాలెంటెడ్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులకీ మా బ్యానర్‌లో అవకాశమిస్తా.