ఉల్లాల.. ఓ రొమాంటిక్ స్టోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలన్ పాత్రలతో తెలుగు ఆడియన్స్‌కి బాగా పరిచయమైన సత్యప్రకాశ్ దర్శకుడిగా రూపొందిస్తున్న చిత్రం -ఉల్లాల ఉల్లాల. ఆనందం, లవర్స్ డే చిత్రాల నిర్మాత ఏ గురురాజ్ రూపొందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్స్ దశలోవున్న చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నారు. ఈక్రమంలో సీనియర్ హీరో వెంకటేష్ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. రొమాంటిక్ ప్రేమ కథగా తెరకెక్కిన సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, తొలిసారి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రకాశ్‌ను అభినందించారు. ఈ సందర్భంగా నిర్మాత గురురాజ్ మాట్లాడుతూ -చిత్రానికి తానే కథ అందించానని, సత్యప్రకాశ్‌లో నటుడిగా ఎంత ఫైర్ ఉందో దర్శకుడిగానూ అంతే ఫైర్‌తో సినిమా చేశారన్నారు. ఈ సినిమా నిర్మాతగా నాకు, దర్శకుడిగా సత్యప్రకాశ్‌కు ఓ టర్నింగ్ పాయింట్ అవుతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. దర్శకుడు సత్యప్రకాశ్ మాట్లాడుతూ -నన్ను దర్శకుడిని చేసిన గురురాజ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా. లీడ్‌రోల్ చేస్తున్న నా కుమారుడు నటరాజ్‌ను ఆశీర్వదించింది. ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపర్చని సినిమా ఇది. హీరోయిన్లుగా నూరిన్, అంకిత ఆకట్టుకుంటారు అన్నారు. కార్యక్రమంలో నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.