నానీతో త్రినాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ కథానాయకుడు నానీ హీరోగా ‘సినిమా చూపిస్తమావా’ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈరోజు బెక్కం వేణుగోపాల్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రెండీ సినిమాలు తీయాలని కొత్త కథలతో గుర్తింపు పొందాలని త్రినాథరావుతో పనిచేయడం ప్రారంభించానని, దిల్‌రాజు బ్యానర్‌లో కోప్రొడ్యూసర్‌గా త్రినాథరావు దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నామని చెప్పారు. అలాగే ‘బాయ్‌ఫ్రెండ్’ చిత్రం నిర్మాణంలో వుందని, ఈ చిత్రానికి ఛోటాకెనాయుడు ఫొటోగ్రఫీ అందిస్తున్నారని అన్నారు. దర్శకుడు త్రినాథరావు మాట్లాడుతూ, పరిశ్రమకు వచ్చిన తర్వాతే పుట్టినరోజులు చేసుకోవడం మొదలైందని, ఇక్కడ అవకాశాలు ఇచ్చింది వేణుగోపాలేనని, ఆయన పుట్టినరోజు నా పుట్టిన రోజు ఒకే రోజు కావడం ఆనందంగా వుందని అన్నారు. మా కాంబినేషన్‌లో రెండు విజయాలు అందుకున్నామని, ప్రస్తుతం మరో సినిమా స్క్రిప్ట్ దశలో వుందని, ఆ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నానన్నారు. అలాగే నానీ హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్‌లో సినిమా చేస్తున్నామని చెప్పారు. భాస్కరభట్ల మాట్లాడుతూ, లక్కీ మీడియా బ్యానర్‌లో చాలా పాటలు రాశానని, నిర్మాత వేణుకు, దర్శకుడు త్రినాథ్‌కు జన్మదిన శుభాకాంక్షలు అన్నారు.