ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘ఖుషి’, ‘పులి’ సినిమాల తర్వాత వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. 15 ఏళ్ల క్రితం ‘ఖుషి’ సినిమా విడుదలైన రోజే ఈ సినిమాను మొదలుపెట్టడం విశేషం. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ఖుషి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ ఫ్యాక్షన్ లీడర్ ప్రేమకథగా ఉంటుందని అన్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్‌మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి జరగనుందని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కథ: ఆకుల శివ, కెమెరా: సుందర్ రాజన్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, యాక్షన్: రామ్‌లక్ష్మణ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.జె.సూర్య, నిర్మాత: శరత్‌మరార్.