ఉద్విగ్నతతో కదిలిపోయా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సైరా’లాంటి కథను సినిమా చేయాలన్న ఊహనుంచే కష్టం మొదలవుతుంది. అయితే, ఒక్కసారి ముఖానికి మేకప్ పడితే -కష్టం తెలీదు. వయసు గుర్తురాదు. అభిమానులు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో ఆ ఒక్క విషయమే ఆలోచనకొస్తుంది. పాతికేళ్ల కిందటి జోష్ మళ్లీ నన్నావహిస్తుంది -అన్నారు సీనియర్ హీరో చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై రామ్‌చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -సైరా. చిరుకు జోడీగా నయనతార నటిస్తే, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, సుదీప్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సైరా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ -సెప్టెంబర్ 22 నా జీవితంలో అద్భుతమైన ల్యాండ్ మార్క్. అందుక్కారణమైన అభిమానులకు ధన్యవాదాలు. 1978లో ఇదే రోజున తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైంది. ఆ రోజు ఎంతో ఉద్విగ్నతకు గురయ్యా. ఇనే్నళ్ల తరువాత ‘సైరా’ కారణంగా మళ్లీ అలాంటి అనుభూతికి గురవుతున్నా. భగత్‌సింగ్ పాత్ర చేయాలని ఉండేది. కానీ, ఏ రచయితా ఆ పాత్రను నా దగ్గరకు తేలేదు. అటువంటి సమయంలో ఎన్నో కోణాలున్న వీరుడు ఉయ్యాలవాడ కథ చేస్తే బావుంటుందని పరుచురి బ్రదర్స్ ప్రతిపాదించారు. కథ విన్న తరువాత బుర్రకథలు, ఒగ్గు కథలకే పరిమితమైపోయిన యోధుడి కథ ప్రపంచానికి తెలియాలనిపించింది. ఆ ఆలోచనే సైరాకు ప్రాణం పోసింది. ఒక మంగళ్‌పాండే, ఝాన్సీ లక్ష్మీబాయ్, భగత్‌సింగ్, సుభాష్ చంద్రబోస్, గాంధీ గురించి అందరికీ తెలుసు. వీరందరికంటే ముందే స్వాతంత్య్ర సమరాంగణలోకి దిగిన ఉయ్యాలవాడ గురించి పరుచూరి బ్రదర్స్ రెండోసారి ప్రస్తావించగానే ఒప్పుకున్నా.
కథకు భారీ బడ్జెట్ పెద్ద సవాల్. సినిమా తీయడానికి ధైర్యంగా ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే, పరోక్షంగా బాహుబలితో ధైర్యం నింపాడు రాజవౌళి. రిస్క్ ఏదో మనమే చేద్దామంటూ చరణ్ ప్రతిపాదించినపుడు ఆశ్చర్యపోయా. అతని ధైర్యానికి నేనూ సై అన్నా. నేనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలన్న ప్రతిపాదనా వచ్చినపుడు -నో చెప్పేశా. ధ్రువ చిత్రంతో నమ్మకం కలిగించిన సురేందర్ రెడ్డి పేరును చరణ్ ప్రస్తావించాడు. అడగ్గానే ఒప్పుకుంటాడనుకున్నాం. ‘వారం టైం ఇవ్వండి, మళ్లీ వచ్చి చెప్తా’ అంటూ వెళ్లిపోయాడు. ఆ టైంలోనే రాయలసీమకు వెళ్లి పరిశోదన చేసి కథను తనదైన శైలిలోకి మార్చుకున్నాడు. సెట్స్‌పైకి వెళ్తున్నపుడూ రిస్క్ చేస్తున్నానేమో అనిపించింది. ఒక్కసారి అడుగుపెట్టిన తరువాత ఇక తిరిగి చూడలేదు. యవతను ఆకట్టుకోడానికి కల్యాణ్ వాయిస్ ఓవర్ తీసుకున్నాం. పరిచయ సన్నివేశాలతోపాటు, చివర్లో రెండు నిమిషాలు ఆయన గొంతు వినిపిస్తుంది. పాటలు, డ్యాన్స్‌లు లేకున్నా యూత్ కనెక్టయ్యే సినిమా. ప్రతి భారతీయుడు గుర్వించే సినిమా. అలాంటి చిత్రాన్ని తీసిన చరణ్‌కు అభినందనలు. లాభాపేక్ష లేకుండా చేసిన సినిమా ఇది. ధీరోదాత్తమైన పాత్రల కోసం అమితాబ్, సేతుపతి, సుదీప్, జగపతిబాబు.. ఇలా ప్రతి ఒక్కరూ ఒప్పుకోవడం గొప్ప విషయం. సినిమాను విజువల్ వండర్‌లా తీర్చిదిద్దిన రత్నవేలు సినిమాటోగ్రఫీ వెనుక చాలా శ్రమ ఉంది. వాళ్లందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు అన్నారు.
ముఖ్య అతిథి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ -చిరంజీవి నాకు అన్నయ్యే కావొచ్చు. కానీ, నేనూ మీకులా ఆయనకు అభిమానిని. ఇంటర్మీడియట్ వయసులో ఒక వైఫల్యం కారణంగా తుపాకితో కాల్చుకుని చనిపోవాలనుకున్నా. ఆ టైంలో చిరంజీవి ఇచ్చిన భరోసా నా లైఫ్‌నే మార్చేసింది. ఇప్పుడిలా ఉన్నానంటే కారణం ఆయనే. అంతా బావుండాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి. ఇక స్వార్థం చూసుకోకుండా -స్వాతంత్య్ర పోరాట గొప్పతనం తెలిపే వీరుడి కథను నిర్మించిన చరణ్‌ను అభినందించాలి. త్యాగఫలాలు అందించిన పోరాట వీరులనుంచి ఉయ్యాలవాడ చరిత్రను సురేందర్ రెడ్డి తెరకెక్కించటం నిజంగా అద్భుతం. ఉయ్యాలవాడ అంటే చిరంజీవి గుర్తుకొచ్చేలా ఉంటుంది సినిమా. దేశాభిమానం ఉన్నవాడిగా సైరాకు గొంతునిచ్చా. చాలా రోజుల తరువాత అన్నయ్య చిత్రానికి గొంతనివ్వడం ఆనందంగా ఉంది అన్నారు. దర్శకుడు ఎస్‌ఎస్ రాజవౌళి మాట్లాడుతూ -రెండు దశాబ్దాలపాటు పరుచూరి బ్రదర్స్ గుండెల్లో మోసిన కథను నా హీరో రామ్‌చరణ్ ప్రజలకు అందిస్తున్నాడు. ఇది ఆయన తండ్రికి ఇచ్చే గిఫ్ట్ కాదు, తెలుగువారికిచ్చే బహుమతి. ఇందులో అత్యధికంగా వీఎఫ్‌ఎక్స్ షాట్స్ తీశారు. ఎమోషన్స్ క్యారీ చేస్తూ వీఎఫ్‌ఎక్స్‌ను అనుసంధానించటం చిన్న విషయం కాదు. సో, సురేందర్‌రెడ్డిని అభినందించి తీరాలి. కార్యక్రమంలో పలువురు ‘సైరా’ గొప్పతనాన్ని వివరిస్తూ -పాన్ ఇండియా సినిమా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.