ఎన్టీఆర్ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జక్కన్న సినిమా అంత త్వరగా పూర్తి కాదు. అతననుకున్న రూపంలోకి కళాఖండం వచ్చే వరకూ చెక్కుతూనే ఉంటాడు. రాజవౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న తాజా ప్రాజెక్టు ట్రిపుల్ ఆర్. రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా చారిత్రక పాత్రలకు కాల్పానికత కలిపి సోషియా ఫాంటసీగా రాజవౌళి రూపొందిస్తున్న ప్రాజెక్టు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టేలానే ఉంది. ఈ సినిమా పూర్తయ్యేసరికి -జూ.ఎన్టీఆర్ కోసం చాలా ప్రాజెక్టులో క్యూ కడుతున్నాయి. ట్రిపుల్ ఆర్ తరువాత ఎన్టీఆర్ ఎంపిక చేసుకునే ప్రాజెక్టు ఏమై ఉంటుందన్న అంశంపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తమిళ దర్శకుడు అట్లీకుమార్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, దర్శకుడు కొరటాల శివ.. ఇలా ఎన్టీఆర్ కోసం చాలామంది దర్శకులే ఎదురు చూస్తున్నారు. అయితే, జక్కన్న ప్రాజెక్టు పూర్తిచేసిన వెంటనే ఎన్టీఆర్ -అట్లీకుమార్ కాంబినేషన్‌లో ప్రాజెక్టు ఎక్కడానికే ఎక్కువ అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం తమిళ హీరో విజయ్‌తో ‘బిగిల్’ ప్రాజెక్టు చేస్తున్న అట్లీ -తరువాతి ప్రాజెక్టుని ఎన్టీఆర్‌తో ఇప్పటికే సెట్ చేశాడని అంటున్నారు. తనకు బాగా అలవాటైన మాస్ యాక్షన్ స్టోరీ ఒకటి ఎన్టీఆర్‌కు వినిపించి ఓకే చేయించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. తన సినిమాల సీక్వెన్స్ ఫ్లేవర్‌ను దృష్టిలో పెట్టుకుని -ఊర మాస్ కథ ఒకటి చేసే ఆలోచన చేస్తుండటంతో అట్లీ ప్రాజెక్టువైపు ఆసక్తి చూపించే అవకాశం ఉందంటున్నారు. మరోపక్క దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాపర్ 2, సైరా తరువాత చిరంజీవితో కొరటాల చేయబోయే ప్రాజెక్టులు పూర్తి కావడానికి కాస్త టైమ్ పట్టొచ్చు కనుక -అప్పటికి బిగిల్ పూర్తి చేసి ఫ్రీ అయిపోతున్న అట్లీతోనే ముందుకెళ్లొచ్చన్న చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్టుపై త్వరలోనే ఓ క్లారిటీ రావొచ్చు.