ఎమోషనల్ లవ్ స్టోరీ నిన్నుతలచి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనిల్‌తోట దర్శకత్వంలో ఎస్‌ఎల్‌ఎన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం -నిన్ను తలచి. వంకీ ఎక్కసిరి, స్ట్ఫెపాటిల్ హీరో హీరోయిన్లు. ఏలేంద్ర మహావీర సంగీతం సమకూర్చారు. ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన చిత్రాన్ని సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ను దర్శకుడు బోయపాటి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ -చిన్న సినిమాలకు అండగా నిలుస్తోన్న మీడియాకు ధన్యవాదాలు. నిన్ను తలచి టైటిల్‌లోనే పాజిటివ్ ఎనర్జీ ఉంది. పరిశ్రమలో మంచి సినిమానా? కాదా? అనే రెండే ఉంటాయి. మంచి సినిమాను మనం ప్రోత్సహించాల్సిందే. దర్శక నిర్మాతలు టైటిల్‌ని ఎంపిక చేసుకోవడంతోనే సగం సక్సెస్ అయ్యారు. మంచి పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకముంది. చిత్రబృందానికి నా బెస్ట్ విషెస్ అన్నారు. దర్శకుడు అనిల్ తోట మాట్లాడుతూ -నిన్ను తలచి సినిమా సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకూ సినిమా అంతా పాజిటివ్‌గా ముందుకు వెళ్తుంది. డివోపీ శ్యామ్‌ప్రసాద్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీమణి, పూర్ణాచారి మంచి సాహిత్యం అందించారు. నిన్ను తలచి సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా అన్నారు. హీరో వంశీ మాట్లాడుతూ -ఇప్పటికే ట్రైలర్, టీజర్ చూసి, పాటలు విన్నవాళ్లకు సినిమాపై ఓ ఐడియా వచ్చి ఉంటుంది. దర్శకుడు అనిల్ తను అనుకున్న పాయింట్‌ను డీసెంట్‌గా ప్రజెంట్ చేశాడు. మ్యూజిక్, కెమెరావర్క్ సినిమాకు ప్లస్. ఓ ఫీల్ గుడ్ మూవీతో టాలీవుడ్‌కు పరిచయం కావడం హ్యాపీగా ఉంది. బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తున్న నిర్మాతలకు థాంక్స్. సెప్టెంబర్ 27న మీ ముందుకొస్తున్న నన్ను ఆశీర్వదించండి అన్నారు. హీరోయిన్ స్ట్ఫె పటేల్ మాట్లాడుతూ -మంచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నందుకు హ్యాపీగా ఉంది. అవకాశమిచ్చిన దర్శకు నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. సంగీత దర్శకుడు ఎలెందర్ మాట్లాడుతూ -నిన్ను తలచి టైటిల్ సాంగ్ సినిమాకు హైలెట్. నిర్మాత అంజి సినిమాను రిచ్‌గా తీశారు. దర్శకుడు అనిల్ మంచి ఎమోషనల్ సబ్జెక్టుతో మీ ముందుకు వస్తున్నాడు. నిన్ను తలచి టీంని ఆదరించండి అన్నారు.