వీడే.. డబ్ల్యుఎఫ్‌ఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలుగురు హీరోయిన్లతో లవ్ స్టోరీని రక్తికట్టించేందుకు సరికొత్త మేకోవర్‌లో వచ్చేశాడు వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా విభిన్న ప్రేమ కథా చిత్రం తెరకెక్కుతుండటం తెలిసిందే. ఈమధ్యే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ డిఫరెంట్ స్టయిల్ టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై వల్లభ నిర్మిస్తోన్న ఈ సినిమా నుంచి హీరో విజయ్ మేకోవర్‌తో ఫస్ట్‌లుక్‌ని వదిలారు. ముఖంమీద గాయాలు.. చేతిలో సిగరెట్‌తో వస్తున్న దేవరకొండ మరోసారి రఫ్‌లుక్‌తో పోస్టర్‌పై ప్రత్యక్షమయ్యాడు. అగ్రెసివ్ ఎక్స్‌ప్రెషన్‌లోవున్న విజయ్ లుక్ -ఆ పాత్రపట్ల ఆసక్తిని పెంచేదిగా ఉంది. సినిమాలో నలుగురు హీరోయిన్లు ఉన్నారు కనుక -విజయ్ దేవరకొండ నాలుగు షేడ్స్‌లో కనిపించొచ్చన్న అంచనాలూ లేకపోలేదు. రాశిఖన్నా, కేథరిన్, ఐశర్య రాజేశ్, ఎజిబెల్లా ఫిమేల్ లీడ్స్. వీళ్లంతా హీరోయిన్లుగానే కనిపిస్తారా? స్టోరీని మలుపుతిప్పే ముఖ్యపాత్రలు ఎవరైనా పోషిస్తున్నారా? అన్నది మరిన్ని అప్‌డేట్స్ వస్తేగానీ తెలీదు. గోపీసుందర్ సమకూరుస్తున్న సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుందన్న మాట చిత్రబృందం నుంచి మాత్రం వినిపిస్తోంది.