ఆశల రాశి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్వాలిటీ ఎంత బావున్నా -కంటెంట్ కూడా కనెక్టవ్‌గా ఉంటేనే సినిమా కిక్కునిస్తుంది. ఇటీవలి కాలంలో ఫెయిలైన చాలా సినిమాలు, సక్సెస్ సాధించిన కొద్ది సినిమాలు చెప్పకనే చెబుతోన్న నిజమిది. ఇదే సూత్రం కెరీర్‌కూ వర్తించదని అనలేం. అందగత్తె రాశిఖన్నా ఇండస్ట్రీకి వచ్చి చాలాకాలమే అయ్యింది. జూ. ఎన్టీఆర్ వినా స్టార్ హీరోల సరసన కనిపించే అవకాశం రాకున్నా -మీడియం హీరోలతో కెరీర్‌ను సంతృప్తికరంగానే నడిపిస్తోంది. కాకపోతే -ఓ రేంజ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలన్న రాశి ఆశ మాత్రం ఇంకా ఊరిస్తూనే ఉంది. హీరోయిన్ మెటీరియల్‌గా అన్ని క్వాలిటీలూ ఉన్నా, కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే కంటెంట్ సినిమా ఒక్కటీ రాశి అకౌంట్‌లో పడటం లేదు. తాజాగా -వరల్డ్ ఫేమస్ లవర్, వెంకీమామ, ప్రతిరోజు పండగే చిత్రాలతో బిజీ అయిన రాశి.. వరల్డ్ ఫేమస్ లవర్‌లో దేవరకొండతో చూపించే కెమిస్ట్రీపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుందట.
విజయ్ దేవరకొండతో జోడీకట్టాకే -రష్మిక ఫేట్ మారిపోయింది. అలాంటి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తన ఫేట్‌నూ మార్చకపోతాడా? ఆన్న ఆలోచనలో ఉందట రాశి. అదే జరిగితే -స్టార్ హీరోల నుంచి పిలుపు రావొచ్చన్నది ఆమె ఆలోచన కావొచ్చు. కెరీర్‌పై పాజిటివ్ దృక్ఫథం మంచిదే అయినా -ఆ ఛాన్స్ అదుకోగలిగే ‘టైమింగ్’ కూడా కలిసిరావాలి. రాశి కెరీర్‌లో ఇప్పటి వరకూ సక్సెస్‌లు లేవని చెప్పలేం. కాని, కెరీర్‌ని ములుపుతిప్పే బ్లాక్‌బస్టర్ ఒక్కటీ లేదు. ‘డబ్ల్యుఎఫ్‌ఎల్’లో మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నా, లీడ్‌రోల్ రాశిదే కనుక ఆమె
ఆశ నెరవేరాలనే ఆశిద్దాం.