నయన్ నెట్రికన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నయనతార లీడ్ రోల్‌లో ప్రియుడు విఘ్నేశ్ శివన్ వైవిథ్యమైన సినిమాకు ప్లాన్ చేసినట్టు కొద్దిరోజులుగా వినిపిస్తోన్న మాట. గృహం ఫేమ్ మిలింద్‌రావ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టూ వినిపిస్తోంది. ఈ కథనాలను నిజం చేస్తూ ప్రాజెక్టు పట్టాలెక్కడమే కాదు, రెగ్యులర్ షూటింగ్ సైతం మొదలైంది. తాజాగా సినిమా టైటిల్ నెట్రికన్‌ను కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ వదిలారు. పోస్టర్‌లో బ్రెయిలీ లిపిలో అక్షరాలు ఉండటంతో, లీడ్‌రోల్ చేస్తున్న నయన్ అంధురాలు కావొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అలాగే పోస్టర్‌పై రక్తపు మరకలు, సంకెళ్లు, కొరడా కనిపిస్తుండటం థ్రిల్లర్ కానె్సప్ట్‌తో సినిమా తెరకెక్కనుందా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. థ్రిల్లర్ కథాంశమైతే -తనదైన పెర్ఫార్మెన్స్‌తో నయన్ సినిమాను రక్తి కట్టించగలదన్న అంచనాలు లేకపోలేదు.