మా’లో లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ (మా)లో అప్పుడే లొల్లి మొదలైంది. ఎన్నికల్లో విజయం సాధించిన దగ్గర్నుంచీ రెండువర్గాలుగా నడుస్తున్న సంఘంలో -తాజాగా విభేధాలు తారాస్థాయికి చేరుతున్నాయి. సంఘంలో అవకతవకలకు పాల్పడ్డారని, అధ్యక్ష పదవి నుంచి గౌరవప్రదంగా తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ నరేశ్‌కు కార్యవర్గ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ‘మా’ ఎన్నికల తరువాత ప్రమాణ స్వీకారం రోజునుంచే రెండువర్గాల మధ్య ఎడమొగం పెడమొగం వ్యవహారం బయటపడటం తెలిసిందే. ప్రమాణ స్వీకార ప్రసంగ వేదికపై అధ్యక్షుడు నరేశ్‌కు రాజశేఖర్ చలోక్తులతో చురకలంటించారు. నరేశ్ తన ప్రసంగంలో ‘నేను.. నేను’ అని పదే పదే ప్రస్తావించటంతో, అందరం కలిసున్న సంఘంలో ‘మేము’ అనకుండా నేను అని మాట్లాడటమేంటంటూ వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేసి అలకబూనారు. పెద్దల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగినా, తరువాత రెండువర్గాల మధ్య తగవులు చిలికి చిలికి గాలివానగా మారాయి. నివురుగప్పిన నిప్పులా సాగుతోన్న విభేదాలు -అధ్యక్షుడికి నోటీసు ఇవ్వడం వరకూ వెళ్లటంతో ‘మా’లో ముసలం మొదలైనట్టేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.