11న 11.11కి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిపోయింది -అనుష్క. లేడీ ఓరియంటెడ్‌గా ఆమె చేసిన చిత్రాలు మంచి విజయాలందుకున్నాయి. అనుష్క ప్రధాన పాత్రలో వస్తోన్న మరో చిత్రం -నిశ్శబ్ధం. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నాడు. పోస్టర్ లుక్‌తో ఆసక్తి రేకెత్తించిన చిత్రం ఫస్ట్ లుక్ కోసం అభిమానులంతా నిశ్శబ్ధంగా ఎదురు చూస్తున్నారు. ఆ నిశ్శబ్ధాన్ని చేధించటానికి చిత్రబృందం ముహూర్తం పెట్టేసుకుంది. సెప్టెంబర్ 11న ఉదయం 11.11 గంటలకు ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఓ పోస్టర్‌తో ప్రకటించింది. కథాపరంగా విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలో విదేశీ నటుడు మైఖేల్ మ్యాడ్సన్, మాధవన్, అంజలి, షాలినీపాండే, సుబ్బరాజు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్ సమకూర్చిన సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుందని చిత్రబృందం చెబుతోంది.