రెండో షెడ్యూల్‌కు బాలయ్య రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండో షెడ్యూల్‌కు రెడీ అయిపోయాడు -నందమూరి బాలకృష్ణ. హ్యాపీ మూవీస్ బ్యానర్‌పై బాలకృష్ణ 105వ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సి కళ్యాణ్ నిర్మాత. ‘జైసింహా’ టీం కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న రెండో చిత్రమిది. ఇటీవల థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్తి చేసిన చిత్రబృందం -సెప్టెంబర్ 5నుంచి హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ నిర్వహించనుంది. హీరో బాలకృష్ణ రెండు వైవిధ్యమైన లుక్స్‌లో కనిపిస్తాడని, ఇటీవలే విడుదల చేసిన తొలి లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని చిత్రబృందం చెప్పింది. వినాయక చవితి సందర్భంగా ఆడియన్స్‌కి శుభాకాంక్షలు చెబుతూ, తాజాగా రెండు పోస్టర్లు విడుదల చేశారు. సోహాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రంలో ప్రకాశ్‌రాజ్, జయసుధ, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం, సి రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు.