అలాగైనా.. ఓకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి -రామ్ కష్టాల్లో ఉన్నపుడు ఇద్దరూ కలిసి గట్టెక్కారు. అది -ఇస్మార్ట్ శంకర్. రమేష్ వర్మ -సాయి శీనివాస్ కెరీర్ కష్టాలు ఎదుర్కొంటూ -కలిసి గట్టెక్కారు. అది -రాక్షసుడు. ఇదే ఫార్ములాతో కెరీర్‌ను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు -సాయిధరమ్ తేజ్. ఇటీవల వచ్చిన చిత్రలహరి సైతం -సాయితేజ్ కెరీర్‌కు పెద్ద బ్రేక్‌నిచ్చిన సినిమా కాలేకపోయింది. దీంతో హిట్టుకోసం మళ్లీ వెతుకులాట తప్పలేదు. ప్రస్తుతం ప్రతిరోజూ పండగే సినిమాతో బిజీగావున్న సాయితేజ్ -తరువాతి రెండు ప్రాజెక్టులు కష్టాల్లోవున్న దర్శకులతో చేస్తున్నాడట. పదేళ్ల క్రితం చేసిన ప్రస్థానం మంచి పేరు తెచ్చినా -ఆ తరువాత దర్శకుడు దేవ కట్టాకు సరైన హిట్టుపడలేదు.
తరువాత చేసిన ఆటోనగర్ సూర్య, దూసుకెళ్తా చిత్రాలు దేవ కట్టా స్టామినాను చూపించే చిత్రాలు కాలేకపోయాయి. ఇప్పుడు దేవ కట్టా చెప్పిన కథకు సాయితేజ్ ఓకే చెప్పడంతో -వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. సాయి ఓకే చేసుకున్న మరో దర్శకుడు మేర్లపాక గాంధీ. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో మంచి పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ, తరువాత ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం సినిమాలను నిలబెట్టలేకపోయాడు. తాజాగా మేర్లపాక గాంధీ చెప్పిన కామెడీ స్క్రిప్ట్‌కూ సాయితేజ్ కనెక్టవ్వడంతో -ప్రాజెక్టును చేద్దామన్న నిర్ణయానికి వచ్చారట. సో, పైన చెప్పుకున్న స్ట్రాటజీని సెంటిమెంట్‌గా ఫీలైతే -సాయితేజ్‌కు ఓ రెండు హిట్లు పడతాయనుకోవాలి.